Entertainment
నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్


Views: 0
‘కాంతార’ ఓ కన్నడ సినిమా.. ఉడిపి మంగళూర్ రిజియన్ లో ప్రముఖంగా కనిపించే భూతకోల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. 1887 1970 అండ్ 1990ల కాలంలో ఆదివాసీల కథగా ఈ మూవీని రూపొందించారు. విష్ణు మూర్తి అవతారాల్లోని వరాహ రూపాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ కర్ణటకలోని ఓ తెగ వారి ఆచార వ్యవహారాలకు అద్దంపడుతూ మనుషులంతా సమానమేననే కాన్సెప్ట్ తో రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించాడు. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.కన్నడ నేటివిటీ నేపథ్యంలో సప్తమి గౌడ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదలై అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ రీసెంట్ గా తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు రూ. 22 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
ఇదిలా వుంటే దేశ వ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటున్న ఈ మూవీపై మునుపెన్నడూ లేని విధంగా స్టార్స్ క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఈ సినిమాని ఎట్టపరిస్థితుల్లోనూ మిస్సవ్వొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ నుంచి కోలీవుడ్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరూ ఈ మూవీని ప్రత్యేకంగా చూడటమే కాకుండా చిత్ర బృందాన్ని హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందుగా స్పందించారు. ఇప్పటికే ఈ మూవీని రెండు సార్లు చూశానని రోమాంచిత అనుభూతి కలిగిందని చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించాడు. ఆ తరువాత అనుష్క కూడా సోషల్ మీడియా వేదికగా ఈ మూవీని కొనియాడింది. సినిమాని ఎవరు మిస్ కావద్దంటూ పోస్ట్ పెట్టింది. ‘కాంతార’ ప్రేక్షకుల్ని థియేటర్లలోకి రప్పించడానికి స్టార్స్ భారీ బడ్జెట్ మేకింగ్ వ్యాల్యూస్ అని మేకర్స్ ఆలోచిస్తున్న వేళ ‘కాంతార’ వారికి గట్టి గుణపాఠాలు నేర్పుతోందని ఎలాంటి స్టార్స్ లేకపోయినా సరే కంటెంట్ స్ట్రాంగ్ గా వుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘కాంతార’ రుజువు చేసిందని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ మూవీని ఖచ్చితంగా చూడాలన్నారు.
ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘కాంతార’పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశానని ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే వుందని ఇదొక అద్భుతమైన అనుభవం అని తెలిపింది. అంతే కాకుండా సాంప్రదాయంచ జానపదకథలు దేశీయ సమస్యల పమ్మేళనమే ఈ సినిమా. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. రచన దర్శకత్వం.. అన్నీ మరో స్థాయిలో వున్నాయి. ప్రకృతి అందాలని చూపించిన విధానం.. యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించిన తీరు అద్భుతం. సినిమా అంటే ఇది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది.
తమిళ వెర్షన్ ని ప్రత్యూకంగా వీక్షించిన హీరో కార్తి ప్రత్యేకంగా రిషబ్ శెట్టిన ఆలింగనం చేసుకుని అభినందించడమే కాకుండా సినిమాని తప్పకుండా అందరూ చూడాలని కోరడం విశేషం. తమళం నుంచి శరత్ కుమార్ బాలీవుడ్ డైరెక్టర్ మధూర్ బండార్కర్ శిల్పాశెట్టి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా గూస్ బంప్స్ తెప్పించిందని ఫొటోగ్రఫీ సంగీతం డైరెక్షన్ రిషబ్ శెట్టి నటన నెక్ట్స్ లెవెల్లో వున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు స్టార్స్ క్రిటిక్స్ ఈ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూనే సినిమాని అందరూ చూడాలంటూ యునానిమస్ గా ప్రమోషన్స్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Entertainment
బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర


Views: 4077
బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర
జనంవెలుగు, నిజామాబాద్:- బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి అని సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో బరాబర్ ప్రేమిస్తా సినిమా టీం డైరెక్టర్ సంపత్ రుద్ర, హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీ, ఇంద్రకరణ్ లు విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా అన్ని ఎమోషన్లతో కూడిన అందమైన ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించి త్వరలో తమ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుందని కావున తమ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ చిత్రం పూర్తిగా దాదాపు తెలంగాణలోని ముఖ్యమైన జిల్లాలలో ఆయన వివరించారు.
ఇదే బ్యానర్ పైన తమ తదుపరి చిత్రం కూడా ఉంటుందని ఆ చిత్రం దాదాపు 40 శాతం వరకు నిజామాబాద్ జిల్లాలోని అందమైన లోకేషన్లను ఎంపిక చేసుకుని రాబోయే తమ చిత్రానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బరాబర్ ప్రేమిస్తా చిత్రంలో యువతకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను నిర్మించామన్నారు.
సినిమాను తెలంగాణలో తీయడం జరిగిందన్నారు. తాను నెక్స్ట్ నిర్మించే సినిమాను నిజామాబాద్ లో చేసే ప్రయత్నం చేస్తామన్నారు. సి సి క్రియేషన్స్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరారు.
Entertainment
ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు


Views: 0
ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు
జనంవెలుగు, మన్యం:- పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి. మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి పోవడం మొదలుపెట్టింది. కాళ్లు తడబడటం ప్రారంభమైంది. ఆ మైకం నుంచి తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కన ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇదే మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్ళు వారించినప్పటికీ అతడు ఒప్పుకోలేదు. అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు. దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. విద్యుత్ స్తంభం పెట్టిన అతడు తీగలపై పడుకున్నాడు. అక్కడ చాలాసార్లు తనదైన విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.
సోషల్ మీడియాలో సంచలనం
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతడి తీరుపై మండిపడుతున్నారు.
Entertainment
ఆత్మీయ సమ్మేళనం..


Views: 0
ఆత్మీయ సమ్మేళనం..
ఉప్పొంగిన ఉత్సహం
జనంవెలుగు, వెబ్ డెస్క్:- వారంతా ఒకే పాఠశాలలో చదివారు. కానీ ఇప్పుడు వారి మధ్య పలకరింపులు లేవు.. కనీసం ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదు.. కలుసుకోవాలని ఉన్న కుదరని పరిస్థితులు.. ప్రస్తుతం వారంతా ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. తామంత ఒకే చోట కలవాలన్న ఆలోచన కొందరిలో కలిగింది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఐదు నెలల సమయం పట్టింది… ఎంతో ఓర్పుతో తమతో కలిసి చదివిన వారి వివరాలు సేకరించారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనానికి మోర్తాడ్ లోని
దేవి చెట్టు వేదిక అయింది.
మోర్తాడ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1990-91పూర్వ విద్యార్థుల బ్యాచ్, మళ్లీ కలుసుకున్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వచ్చారు.
గుర్తుకొస్తునాయీ….. !
33 ఏళ్ల క్రితం హై స్కూల్ విద్యార్థులు ఇప్పుడు వారి పిల్లలు ఇంటర్మీడియట్, పదో తరగతిలో చదువుతున్నారు. ఆ రోజుల్లో కలిసి ఉండే కొంతమంది స్నేహితులు మినహా మిగతా వారెవరు ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు ఆకస్మ త్తుగా కలుసుకోవడం వారిలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘ఒరేయ్…. నన్ను గుర్తుపట్టావా…? నేను నీ ఫ్రెండ్ సురేష్ గౌడ్ ని అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఒక్కరూ పూర్వ మిత్రులతో కలిసి ముచ్చటించుకున్నారు. గత అనుభూతులను నెమరు వేసుకున్నారు. మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వయస్సుతో ప్రమేయం లేకుండా డ్యాన్సులుచేశారు. విందు వినోదాలతో కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది.

















