నిర్మల్
మరణంలో కూడా వీడని మిత్ర ‘బందం”


మరణంలో కూడా వీడని మిత్ర ‘బందం”
బాధిత కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం
జనం వెలుగు, బాసర:- ముధోల్ మండలం చించాల గ్రామంలో ఇటీవల హఠాన్మరణంతో మృతి చెందిన. రాఘవేందర్ కుటుంబ సభ్యులకు, 19 96: 97 బ్యాచ్ కు చెందిన, తమ తోటి సహాయ మిత్రులు, కుటుంబ సభ్యులకు శనివారం 53 వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గతంలో బాసర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మొత్తం 70 మంది మిత్రులు ఉండగా. వాటిలో ఇటీవల అనారోగ్యంతో అటల్ మరణం చెందిన. చెంచాల గ్రామంలో రాఘవేందర్. వారి కుటుంబానికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి చదువు కోసం. తమ, తమ, ఉడుత సహాయంగా. కొందరు మిత్రులు నూతన బట్టలు. నగదు ఆర్థిక సాయం అందజేయగా. అనంతరం రాఘవులు మృతి చెందిన విషయాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మంచి వ్యక్తిగా తమ యొక్క పూర్వ మిత్రుత్వ బంధాన్ని గుర్తుచేస్తూ జ్ఞాపకాలను నెమరు వేశారు. రాఘవేందర్ మృతి తీరని లోటాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన రాఘవేందర్ మాలోని ఉన్నాడని మిత్ర బృందం వారి కుటుంబానికి ధైర్యాన్ని అందించారు. రఘు మంచి వ్యక్తిగా పాఠశాలలో అందరి పట్ల కలిసి మెలిసి ఉంటూ ఆటల్లో కానీ చదువులు కానీ చురుగ్గా ఉండేవారని వారి మరణ వార్త తీరని లోటు అని ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయ్యారు.. దీనితో కొందరు మిత్రులు తమకు తోచినంత నగదు ఆర్థిక సహాయం అందజేసిన వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరోల్ల, సతీష్ ఉపాధ్యాయులు రామ్మోహన్, విజయ్ కుమార్, ప్రవీణ్, లాలన్న, సిరాజ్, సిహెచ్ రవి, పోత గంటి దిగంబర్ తదితరులు ఉన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








