Connect with us

నిర్మల్

దళిత రైతుకు మద్దతుగా కదిలిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు

INTHIYAZ MIRZA

Published

on

లోకేశ్వరంమండలం కనకాపూర్ దళిత రైతుకు మద్దతుగా కదిలిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు

జనం వెలుగు, లోకేశ్వరం:- దళిత రైతుకు మద్దతుగా కనకాపూర్ కు కదిలి వచ్చిన ప్రజాసంఘాలు రాజకీయ పార్టీల నాయకులు కబ్జాకు గురైన భూమిని పరిశీలించి మాట్లాడారు. కొబ్బనోళ్ళ గంగన్న రైతు 33 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవిస్తుంటే అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ రమణారెడ్డి, వీడిసి చైర్మన్ గంటగర్ రాజు, విడిసి సభ్యులు కలిసి కనకాపూర్ దళిత రైతు భూమిని కబ్జా చేశారు.  అక్రమంగా బిల్డింగ్ నిర్మించారు. దేవుని పేరుతో దళిత రైతు భూమిని  గుంజుకోనికి పథకం ప్రకారం ప్లాన్ చేసి, నిన్న  కాషాయ జెండాలు  పాతారు. ఇది గమనించిన దళిత ప్రజా సంఘాలు నేడు కనకాపూర్ లో సమావేశమై దళిత రైతుకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. దళిత రైతులు దళిత రైతుకు దక్కేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వీడిసి వాళ్లకు మద్దతు తెలుపుతూ దళిత రైతుకు అన్యాయం చేశారు. వీడిసివాళ్ళు ఆ భూముల అక్రమంగా బిల్డింగ్ నిర్మించేదాకా తాసిల్దార్, ఎస్ఐ, ఏమి చేశారని  ప్రశ్నించారు. అనేకసార్లు ఫిర్యాదు చేసిన ఎస్ఐ పట్టించుకోలేదు. తహసిల్దార్ పట్టించుకోలేదు. మీ భూమి ఎక్కడుందో మీరే వెతుక్కోమని చెప్పి మాట్లాడారు. ఈ భూమిలో అబ్దుల్లాపూర్ వీడిసి, సర్పంచ్ నాయకత్వంలో ఆ భూమిలోని పొలము ఓడ్లను తొలగిస్తుంటే  జెసిపి కి అడ్డుపడినటువంటి దళిత స్త్రీని నిన్ను ఇందులోనే పాతి పెడతామని చెప్పి పోలీసులు ఆరోజు హెచ్చరించారు. నిర్మించిన బిల్డింగ్ పై కాషాయపు జెండాలు నిన్న ఎగరవేశారు. దేవుని పెడతామని ప్రయత్నం చేశారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడంతో
వీధి లేక భూమి దగ్గరికి వచ్చి కొట్లాటను కొట్లాట కాకుండా చూసి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పారు. కానీ వీడిసి వాళ్ళు పెట్టిన జెండాలు తీసుకుపొమ్మని చెప్పినం  వాళ్ళ కు పోలీసులు చెప్పలేదు . ఈ భూమి నేటికీ ధరణిలో ఉంది. కానీ ఇది ఆ సర్వే నెంబర్ కాదని చెప్పి తహసిల్దార్  మాట్లాడుతున్నారు. మరి మా సర్వే నంబర్ ఎక్కడుందమ్మా అప్పుడు ఎమ్మార్వో ఇచ్చాడు కదా మాకు పట్ట ఇప్పుడు ఎందుకు కాకుండా పోయిందంటే చెప్పడం లేదు. కలెక్టర్  వెంటనే ఈ భూమి సమస్యపై విచారణ జరిపించి, దళిత రైతుబంధు దళిత రైతుకు ఇప్పించాలని చెప్పి ఈ భూమి సర్వే నెంబర్ కాకపోయినా ఇదే భూమి 33 సంవత్సరాలుగా సాగులో ఉంది. రైతు దళితుడు కావున ఆ భూమిని ఆ దళిత రైతుకు పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కానకపూర్ గ్రామ సర్పంచ్ సాలాయి నరేష్ మాజీ సర్పంచ్ నీరడి చిన్ని కుమార్ అంబేద్కర్ సంఘం గ్రామ నాయకులు నగరం గంగన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీమోహన్ బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న నాయకులు తిమ్మాపూర్ దేవేందర్ బి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading