నిర్మల్
CPI(M) జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్లు విడుదల


CPI(M) జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్లు విడుదల
జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలం లో పోస్టర్లు
ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి, D. పోశెట్టిలు మాట్లాడుతూ, బిజెపి మతోన్మాద. కార్పొరేటు విధానాలను వ్యతిరేకించాలని సంక్షేమం మతసామరస్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోసం పోరాడుదాం అని మార్చి23 నుండి 29 వరకు సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు భాగంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. నిర్మల్ జిల్లా లో, జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదులు మేధావులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్మల్ జిల్లా కమిటీ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. మోడీ అమిత్ షా ల నేతృత్వం లో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతూ 23 కోట్ల మందిని నిరుపేదలుగా చేశారు. దేశం అంటే అంబానీ ఆదాని సొత్తుగా మార్చేశారు. నూనెలు వంటగ్యాస్, పెట్రోల్, డిజిల్ తోసహా అన్ని సరుకులు ధరలు రెండు మూడు వందల రెట్లు పెంచారు. 2014లో 410 ఉన్న గ్యాస్ బండ నేడు 1150 రూపాయలకు పెరిగింది . ఈ ధరలు పెరుగుదల వల్ల కార్పొరేటు శక్తులు వేల కోట్ల రూపాయలు లాభాలను పోగేసుకుంటున్నారు. లక్షల కోట్ల ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. భూములను మార్కెట్లను పరిశ్రమలను ఉపాధి కల్పించే రంగాలను పూర్తిగా కార్పొరేట్ పరం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి, డి. పోశెట్టి, సిపిఎం మండల కార్యదర్శి తిమ్మాపూర్ ముత్తన్న, నాయకులు తిమ్మాపూర్ దేవేందర్ బుల్లోల్ల ప్రసాద్ లు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








