నిర్మల్
అమావాస్య రోజున సరాస్వతి గర్భగుడిలో కలకలం


సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి కలకలం సృష్టించిన సైకో
బాసర ఆలయంలో ప్రసాద్ గౌడ్ మరోమారు స్వైర విహారం
జనం వెలగు, బాసర:- బాసర్ సరస్వతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మంగళవారం అమావాస్య రోజున ఓ సైకో స్వైర విహారం చేయడం. కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం బాసర పుణ్యక్షేత్రంలో. ఆలయంలోని ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి తన చేతి మనికట్టును, కత్తితో, కోసుకొని కారుతున్న రక్తంతో గర్భగుడిలోకి ప్రవేశించగా. గమనించిన స్థానికులు ఆలయ సిబ్బంది అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రసాద్ పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో అమ్మవారికి అమావాస్య రోజున రక్త తర్పణం చేసేందుకు వచ్చినట్లు భావించిన స్థానికులు నిజాంబాద్ పట్టణానికి చెందిన. ప్రసాద్ గౌడు గతంలో కూడా రెండుసార్లు ఆలయంలో చేరి బ్లేడుతో చేయి కోసుకొని కలకలం సృష్టించిన విషయం విధితమే, అయినప్పటికీ వారికి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి నచ్చ చెప్పారు. దీనితో తన వ్యక్తిత్వం. మార్చుకోలేక మరో మారు ఆలయంలో స్వైర విహారం. చేపట్టిన ప్రసాద్ గౌడ్ ఆలయంలో ఎలా..? చేరుకోవడం జరిగిందని. స్థానికులు గ్రామస్తులు ఆలయ క్షేత్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని, గతంలో కూడా ఆలయ కార్య నిర్వాణ అధికారికి మరియు పై అధికారులకు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆలయంలో భద్రత సిబ్బంది ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎందుకు అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇప్పటినుండి ఇలాంటి సంఘటనలు, పునర్వృత్తం కాకుండా చూడాలని. గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








