ARTICLE'S
రాజ్యాధికారం కావాలంటే రాజకీయం చేయాల్సిందే


-ప్రత్యక్ష రాజకీయంలో పాల్గొన్న కులాలకు గౌరవం దక్కుతున్నది.
-కేవలం ఓటర్లుగా మిగిలిపోతున్న బహుజన వర్గాలు గుర్తింపుకు నోచని బానిసలుగా మిగిలిపోతున్నారు.
-రాజ్యాధికారంకై సోయి లేని
బీసీ వర్గాలు అంబేద్కర్ హెచ్చరికతోనైనా మారాలి.
*వడ్డేపల్లి మల్లేశం 9014206412
జనంవెలుగు:- భాష వినియోగంలో లేకుంటే జాతులు అంతరిస్తాయి. అదే సందర్భంలో ఆయా జాతులు కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటే భాష జాతులు కాలగర్భంలో కలిసిపోతాయి అధికారం అనేదానికి అంత మహత్తు ఉన్నది. పోరాడి నీ భాషను జాతిని నిలబెట్టుకుంటావా?లేదా? నిర్లక్ష్యంగా, పేలవంగా, బాధ్యతారాహిత్యంగా, అధికారకాంక్ష లేకుండా జీవిస్తే నీ మను గడు ప్రశ్నార్థకమే. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధం కాదు ప్రపంచంలోని మానవాళి క్రమంగా తన నిర్లక్ష్యం, ఇతర జాతుల యొక్క దోపిడీ, పీడన కారణంగా అస్తిత్వాలను కోల్పోయిన విషయం మనందరికీ తెలిసినదే. 565 సంస్థానాలున్న భారత ఖండాన్ని క్రమక్రమంగా పెకలించి కబళించిన ఆంగ్లేయుల పాలన మన అనుభవ0 లోనిదే కదా ? ఇంత జరుగుతున్నా భారత దేశంలో బీసీ వర్గాలకు రాజ్యాధికారం పట్ల తపన, ఆరాటం, కాంక్ష ఎందుకు లేఓ అర్థం కాదు. కేవలం బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలలో మినహాయిస్తే మిగతా చాలా రాష్ట్రాలలో బీసీలు రాజ్యాధికారానికి దూరంగానే ఉండిపోయినారు. ఎవరైనా రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు రాజకీయాలలోకి రావాలి ప్రజా సంబంధాలు పెంపొందించుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో ప్రలోభాలు వాగ్దానాలు ప్రదర్శించి తమ కులాధిపత్యం, ధనాది పత్యం ప్రదర్శించడం ద్వారా కొన్ని ఆధిపత్య కులాలు మాత్రమే ఈ దేశంలో అనాదిగా రాజ్యమేలుతున్నాయి. అంతెందుకు ఉద్యోగి వర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దక్కుతున్న వాటా అత్యల్ప0 అని చెప్పక తప్పదు .ఈ వివక్షతను ఖండించాలి ఉత్పత్తి కులాలయినటువంటి ముఖ్యంగా బీసీ వర్గాలు ఈ దేశ సంపదను సృష్టిస్తూ రాజ్యాధికారంలో ఉన్న ఉన్నత వర్గాలకు అక్రమంగా అప్పనంగా కట్టబెడుతూ తాము మాత్రం చీకట్లో మగ్గుతున్న విషయాన్ని ఇంకెన్నడు గ్రహిస్తారో అర్థం కావడం లేదు. “నీవు ప్రశ్నించకుండా నీ దుస్థితి గురించి అయ్యో పాపం అనేవాళ్లు ఈ లోకంలో ఉండరు జాగ్రత్త. సానుభూతి కోసం, గుర్తింపు కోసం, నీ మంచితనం అమాయకత్వం నిన్ను నిలువునా దహించి వేస్తుంది. పోరాటమే మార్గం, అధికార కాంక్ష సర్వస్వం, రాజకీయ అధికారం కోసం ఉప్పెనలా ఎగిసిపడి బహుజనుల మద్దతుతో దోపిడీ వర్గాల నుండి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. అందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా సమయం ఆసన్నమైనది ఆదమరిచి నీవుంటే నీ మీదనే సారీ చేసే ప్రమాదం ఉన్నది. ఎంతసేపు బీసీ సంఘాల సమావేశాల పేరుతో ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు నటిస్తున్నప్పటికీ మన వాదన భావజాలము ప్రజల వద్దకు చేరడం లేదు అనేది అందరము గ్రహించాలి. మన ఓట్లు మనమే వేసుకునే పరిస్థితి లేనటువంటి దయనీయ స్థితి నుండి బయటపడాలి. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీ వర్గాలకు టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి 60 శాతం ఉన్న మన బీసీ వర్గాల తడాఖా చూపించి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులను ఓడించి నూతన ఒ రవడిలో స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వాన్ని ఏర్పరచాలి.
లోపం ఎక్కడుంది :-
భారతదేశంలోని బీసీ ఉద్యమ కార్యక్రమాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయాన్ని అంగీకరించక తప్పదు. ప్రధానంగా రాజకీయాలలో పార్టీల వారీగా అభ్యర్థులు సమీకరించబడి పోటీ చేయడం, కార్యక్రమాలలో పాల్గొనడం, ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం బీసీ వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ లేకపోవడం వలన బీసీ వర్గాలు అనేక రాజకీయ పార్టీలలో శ్రేణులుగా రెండవ శ్రేణి కార్యకర్తలుగా మిగిలిపోయి ఆయా పార్టీలకు వ0త పాడే బానిస స్థితిలో మిగిలిపోయిన విషయాన్ని సమాజము బీసీ నాయకత్వం కచ్చితంగా గుర్తించాలి. ఆయా రాజకీయ పార్టీలలో జెండాలు మోసే, సేవ చేసే దౌర్భాగ్య పరిస్థితి నుండి బయటపడే విధంగా బీసీ సంఘాలు రెచ్చగొట్టి బాధ్యతలు గుర్తింపు చేసి అందుకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి వ్యవస్థగా బీసీలకు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే బీసీ వర్గాలను ఒక తాటికి తేవడానికి సిద్ధాంత పరంగా కొంత అవకాశం ఉంటుంది. బహుజనులకు సంబంధించి ఇప్పటికీ బీఎస్పీ పార్టీ కొనసాగుతున్నప్పటికీ దానిపట్ల సానుకూల దృక్పథం బీసీలకు లేకపోవడం, బీసీల మీద మిగతా రాజకీయ పార్టీల ఒత్తిడి ఎక్కువ కావడం వలన అనివార్యమైన పరిస్థితులలో బీసీలను ఒకటి చేయడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది .ఇటీవల బీసీ రాజ్యాధికార సమితి ఒక ప్రకటనలో అవకాశమున్న చోట కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ పార్టీ పేరు న ఆ కార్యక్రమం కొనసాగినట్లయితే మరింత బలవంతంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం లాగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలన్నీ కూడా ఉమ్మడి వేదికను తయారు చేసుకోవడంతో పాటు ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లయితే తమకు ఆత్మగౌరవము, గుర్తింపు, హోదా, రాజకీయ అధికారము, స్థానము దక్కుతుంది అనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలలో అవమానాలకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది .అలాగే కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలకు సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆయా సామాజిక వర్గాల కు టికెట్ ఇవ్వడం ద్వారా ఉమ్మడిగా అందరం కలిసి గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు సిరిసిల్లలో 80 శాతం పద్మశాలి కులస్తులు ఉన్నందున అక్కడ పద్మశాలి కులానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వమే దిగివచ్చినా, అధికార బలాలను కదిలించినా మన శక్తి ముందు అందరూ ఓడిపోవాల్సిందే. ఆ ధైర్యాన్ని మనలో మనం నింపుకోలేకపోతున్నాం ఇంకా బానిస మనస్తత్వంతోనే ఊగిసలాడుతున్నాం .ఇప్పటికీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే బీసీ సంఘాల మధ్యన బీసీ కులాల మధ్యన కుమ్ములాటలు కొట్లాటలు జరుగుతూ ఉంటే అగ్రవర్ణాలు చూసి సంబరపడి మన అనైక్యతను మరింత దెబ్బ చేసే విధంగా వ్యవహరిస్తున్న కారణంగా మనం అనాదిగా పరిపాలనకు దూరమై బానిసలుగా బ్రతుకుతున్నాం. అర్థం కాని విషయం 75 సంవత్సరాల తర్వాత కూడా మన ఓట్లను మన అభ్యర్థులకు వేసుకోవడానికి సిద్ధంగా లేమంటే ఎంత బానిస మనస్తత్వాన్ని నర నరానా నింపుకున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. తలవంచి సాష్టాంగ నమస్కారం చేసి, పాలాభిషేకాలు చేస్తూ బానిసలుగా బతకడానికి ఇంకెంతకాలం సిద్ధంగా ఉంటావు బీసీ మిత్రమా! లే లేచి కదలిరా !నీ పౌరుషాన్ని రగిలి0చు. ప్రతి బీసీ ఒక అభ్యర్థిగా ప్రతి కార్యకర్త రాజ్యాధికారం వైపు పరిగెత్తే పోరాట వీరునిగా సిద్ధమైన నాడు మన ముందు ఏ శక్తి నిలువలేదు . మనకు ఉత్పత్తి శక్తి ఉన్నది, మేధస్సు ఉన్నది, విచక్షణా జ్ఞానం ఉంది, విశ్లేషణ పరిజ్ఞానం ఉంది, నిజాయితీ ఉంది, తపన ఆరాట అన్వేషణ ఉంది. ఇక ఇంతకంటే రాజకీయ నాయకునికి పాలనా దక్షునికి ఏం లక్షణాలు కావాలి? ప్రస్తుతం రాజకీయంలో కొనసాగుతున్నటువంటి ఆధిపత్య కులాలకు భూములు సంపద గర్వం అహంకారం కండబలం గణ బలం మాత్రమే ఉన్నాయి. కావలసింది మనకు ఒక్కటే పోరాట స్ఫూర్తిని రగిలించి యుద్ధభూమిలో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. అవసరమైతే ఓడిపోయినా ఫర్లేదు కానీ నా అస్తిత్వాన్ని చాటుకుంటా అని చెప్పగలిగిన నాడు బీసీల సమస్యలు పరిష్కారమవుతాయి. బహుజన ఉద్యమం విజయవంతం అవుతుంది అంతిమంగా బహుజన రాజ్యం వైపు అడుగులు పడతాయి.
బీసీ సంక్షేమ సంఘాలు కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అన్ని పార్టీల్లోని బీసీ వర్గాలను ఆహ్వానించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడంతో పాటు శిక్షణ అధ్యయన తరగతులను ఏర్పాటు చేసి భావజాల వ్యాప్తి ఆత్మస్థైర్యాన్ని నింపి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా విజయవంతం అయితే తర్వాత దేశ వ్యాప్త ఉద్యమానికి మన పోరాటం మన ప్రయత్నమే నాంది అవుతుంది.
రాజ్యాధికారానికి దూరంగా ఇప్పటికే 75 ఏళ్లు గడిచిపోయిన ఇలాగే కొనసాగితే అనేక బీసీ వర్గాలు జాతులు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అదే సందర్భంలో అంబేద్కర్ ప్రకారంపోరాడి యజమానిగా నిలబడతావా ? లేకపోతే అచేతనంగా మిగిలిపోయి బానిసవ మిగిలిపోతావా? తేల్చుకోమని చేసిన హెచ్చరిక ఇప్పటికీ బీసీ వర్గాలకు కనువిప్పు కాకపోతే ఎలా? ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కారణంగా వారి వాటా వారికి దక్కుతున్నది కానీ రాజ్యాంగబద్ధంగా మనకు అలాంటి అవకాశం లేకపోవడం అగ్రవర్ణ నాయకత్వంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ల వర్గాలకే టికెట్ ఇస్తున్న కారణంగా మనకు జరుగుతున్న రాజ్యాంగ ద్రోహాన్ని బట్ట బయలు చేసి అదును చూసి దాడి చేస్తే తప్ప ఈ ఆధిపత్య కులాలు మనల అధికారానికి చేరువకానియవు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










