ARTICLE'S
జనాభా లెక్కలు తేల్చకుండా నాన్చుడు ఎందుకు?


ఇప్పటికే బీసీ వర్గాలు కుల గణనకై డిమాండ్ చేస్తూ ఉంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటి ?
పేద వర్గాలకు ఎంతో కొంత మేలుచేసే జనాభా లెక్కలు వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్ న్యాయసమ్మతం
వడ్డేపల్లి మల్లేశం 9014206412
ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి సిద్ధంగా లేవు కానీ స్వప్రయోజనాల కోసం ఎంతటి అడ్డదారులు దొక్కడానికైనా ముందుంటాయి అని చెప్పడానికి అనేక దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ప్రతి పదేళ్లకోసారి కొనసాగవలసిన జనాభా గణన 2021లో ప్రభుత్వం వాయిదా వేసి పేద వర్గాలకు తీరని ద్రోహం చేసింది. ఇ0 దుకు కరోనా మహమ్మారిని కారణంగా చూపినప్పటికీ చరిత్రలోకి వెళితే అనేక సందర్భాలలో ఆనాటి ప్రభుత్వాలు జనాభా లెక్కలను ఏ కోశాన వాయిదా వేయకుండా ఎంతోకొంత పేద వర్గాలకు లబ్ధిని చేకూర్చి ఈ గణనను కొనసాగించిన విషయాన్ని గమనించవచ్చు.2020 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలోని అన్ని గృహాలలో ఉన్న వ్యక్తుల వివరాలను ఏకకాలంలో సేకరించే గృహ గణన మొదటి దశలో పూర్తి కావలసి ఉండే ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో జనాభాను కృషి చట్టబద్ధంగా కొనసాగవలసి ఉండగా కేంద్ర ప్రభుత్వం వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తూ తన సామాజిక బాధ్యతను విస్మరించిన విషయాన్ని ఒక్కసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. దీని ద్వారా సేకరించే గణాంకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలు పథకాల రూపకల్పనకు ప్రాతిపదికగా పనిచేస్తాయి. ఆంగ్లేయుల కాలంలో 1881 లో తొలిసారిగా ప్రారంభమైన జనగణన 2011 వరకు దాదాపుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది .కరోనా మాదిరిగానే 1918లో దేశవ్యాప్తంగా ఫ్లూ వ్యాపించిన సందర్భంలో కూడా ఆనాటి భారత రిజిస్ట్రార్ జనరల్19 21 లో శ్రమ కోర్చి పూర్తి చేసిన విషయాన్ని నేటి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోకపోతే ఎలా? అలాగే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అధికార మార్పిడి జరిగిన గందరగోళంలో సైతం ఆ తర్వాత వచ్చిన 1951 జనాభా గణన ఏ ఆటంకం లేకుండా కొనసాగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ వాదన :-
గత సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ పెన్ను కాగితాలు లేకుండానే డిజిటల్ పద్ధతిలో జనాభా గణ న త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ ఎ లాంటి పురోగతి లేదు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో కొనసాగించినటువంటి జనాభా లెక్కల వివరాలు శాస్త్రీయంగా కచ్చితంగా లేవని కొత్త గణనను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేపడతామని గతంలో లేని విధంగా సామాజిక ఆర్థిక కొలమానాల ఆధారంగా జనాభా లెక్కలు జరపనున్నట్లు చేసిన ప్రకటన కూడా కార్యరూపం దాల్చితే బాగుండేది. జనాభా గణన ఆధారంగా జనాభా రిజిస్టర్ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పాస్‌పోర్టులు డ్రైవింగ్ లైసెన్లతో పాటు అన్ని వివరాలను కూడా ఆధునికీకరిస్తామని హోంమంత్రి ప్రకటించినప్పటికీ ఎప్పుడు ప్రారంభి స్తారన్న విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వకపోవడమే దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. రాబోయే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగగా మరికొన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగనున్న వేళ కేంద్ర ప్రభుత్వము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల హడావుడిలో ఉన్న కారణంగా ఈ జనగణన మరింత వాయిదా పడే ప్రమాదం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే 2027 తర్వాతనే బహుశా జనగణ జరగవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఒక దశాబ్దం పాటు దేశ ప్రగతిని మనకు మనమే ఆపినట్లు అడ్డుకున్నట్లు అవుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తంఅవుతున్నది.
కుల గణన ఆధారంగా జన గణన:-
సుమారు 60 శాతం ఉన్న బీసీ వర్గాల యొక్క కులాల వారి జనాభా వివరాలు దేశంలో అందుబాటులో లేకపోవడం పట్ల బీసీ వర్గాలు ఆందోళన చేస్తూ గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ జన గణనలో కుల గణనను ప్రాతిపదికగా తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు కూడా ఒక దశలో కులగణన చేయాలని సూచించినప్పటికీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా అమీతుమీ తెలుసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసినదే సుమారు 60 శాతం ఉన్న బీసీ వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం, అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం ఆధిపత్యవర్గాల చేతుల్లో ఉండడం వలన చట్టసభల గడప దాటడం లేదనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి నిర్వహించబోయే జనాభా లెక్కల్లో కులగణన అత్యంత ప్రాధాన్యతను చోటుచేసుకునే అవకాశం ఉన్నది. కనుక తొందరగా నిర్వహించాలని అందరితో పాటు బీసీ వర్గాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి.
జనాభా గణన వాయిదా పడితే నష్టం ఏంటి :-
ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన రేషన్ కార్డులు ఇతర సౌకర్యాలు అన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయించబడుతున్నందున ఈ దశాబ్దంలో పెరిగిన సుమారు 16 కోట్ల జనాభా కు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన ప్రయోజనాలు అనేక కుటుంబాలకు అందకుండా పోతున్నవి. నకిలీ లబ్ధిదారులను నివారించాలన్న, నకిలీ ఓ ట్లను కట్టడి చేయాలన్న సకాలంలో జనగణను నిర్వహించి ఉంటే సాధ్యమై ఉండేదని ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న అనేకమందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర ప్రాయోజిత సౌకర్యాలు అందించబడని కారణంగా అనేక పథకాలకు అనర్హులవుతున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ అనేక మందికి రేషన్ కార్డులు లేని కారణంగా ఆ కుటుంబాలకు ఆ ప్రయోజనం దక్కకుండా పోతున్నది. జనగణన మరింత ఆలస్యమైతే పేద వర్గాలు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉన్నది కనుక జనాభా గణనను తొందరగా పూర్తి చేసి పేద వర్గాలకు ప్రయోజనం కలిగించడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్‌ను సామాజిక బాధ్యతగా పట్టించుకోవాలి. లేకుంటే కేంద్రం దో షిగా ప్రజల ముందు నిలబడవలసి వస్తుంది అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. 2011లో నిర్వహించిన జనాభా గణనలో కుల గణన కూడా నిర్వహించినట్లు ఆనాటి యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ అందులో అనేక లోటు పాట్లు జరిగినట్లు అందుకే ఆ గణ న ను రద్దు చేసినట్లు ప్రకటించడం బీసీ వర్గాలకు అడుగడుగునా ద్రోహం జరుగుతున్నదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరమా?
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










