Politics
బిజెపి పార్టీ బాన్సువాడ నియోజకవర్గం నాయకులు మాల్యాద్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా?


ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
ఈ ఫోటోలు పాత చిత్రాల, కొత్త చిత్రాల కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వైరల్ అవుతున్న వైనం
ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరన్నట్టు అనే వార్తల కథనల ద్వారా ముందుకు వెళుతున్న వైనం
జనంవెలుగు:- బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ మాల్యాద్రి ఆశించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్య నేతలకు కలుస్తున్నారా? బిజెపి పార్టీలో గత అనేక రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న మాల్యాద్రి రెడ్డి ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్న విమర్శలు, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ఎమ్మెల్యే టికెట్ ఆయనకి కన్ఫామ్ అధిష్టానం చేయనున్నారా? అయితే మరో 18 మంది దారి ఎటు, ఒకవేళ మాల్యాద్రి రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సీనియర్ గా ఉన్న, అనేక ఏళ్ళ నుంచి పార్టీనీ బుజస్తంభంపై వేసుకున్న వారి పరిస్థితి ఏమిటి, అనేక ఏళ్ల నుంచి కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ పార్టీని బుజస్తంభలపై వేసుకొని కాసుల బాలరాజ్ పరిస్థితి ఏమిటి? ఆయనకు టికెట్ ఇవ్వన్నారా? టికెట్ రేసులో ఉన్న డాక్టర్ కునిపూర్ రాజారెడ్డి, ఎలమంచిలి శ్రీనివాస్, అంబర్ సింగ్, ఇందూరి చంద్రశేఖర్ తో పాటు పలువురి పరిస్థితి ఏమిటి వారి దారి ఎటు, మదన్మోహన్రావు, సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి లో ఎవరికి కన్ఫామ్, ఇరువురిలో ఒకరికి కన్ఫర్మ్ అయితే మరొకరు బాన్సువాడ నియోజకవర్గంలో టిక్కెట్టు ఇవ్వనున్నారా నూతనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి ఎల్లారెడ్డి నుంచి వారు ఇరువురి కి ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ,,మూడో వ్యక్తిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వనున్నారా? బాన్సువాడ బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం కన్ఫర్మ్ చేయలేకపోయిందని, కన్ఫర్మ్ చేయడంలో అధిష్టానానికి తలనొప్పిగా మారిందని విమర్శలు సర్వత్రా వినిపిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలో, గతంలో జరిగిన ఎన్నికల్లో కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డిలు టికెట్ కోసం పోటాపోటీ పడి, చివరికి కాసుల బాలరాజు కు టికెట్ రావడం, మాల్యాద్రి రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోవటం జరిగింది, బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీలోకి మాల్యాద్రి రెడ్డి జైన్ అయిన తర్వాత బిజెపి పార్టీ ఒక రేంజ్ లో వెలిగిందనే చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికలు కొద్దిరోజులుగా ఉందనే ఉత్సాహంలో బిజెపి శ్రేణులు ఉండగా అప్పటివరకు బిజెపి పార్టీలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి టికెట్ కన్ఫామ్ అని బిజెపి పార్టీ నుంచి మాల్యాద్రి రెడ్డి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొందుతారని బిజెపి జెండా బాన్సువాడ నియోజకవర్గంలో ఎగురుతుందని బిజెపి కార్యకర్తలు కొంతమంది ప్రజలు భావిస్తున్న తరుణంలో, ఎన్నికల కోడ్ కంటే ముందు ఎన్నికల కోడ్ తర్వాత బిజెపి పార్టీలో చురుకుగా ఉన్న మాల్యాద్రి సైలెంట్ గా ఉన్నారని ఆయన సైలెంట్ కు అర్థం ఏమిటో అర్థం కాక ఓవైపు కార్యకర్తలు అభిమానులు, నిరాశ నిస్రుల మధ్య ఉండగా, అయితే కాంగ్రెస్ పార్టీలో మాల్యాద్రి జైన్ అయితున్నట్టు, ఎమ్మెల్యే టికెట్ ఆయనకి కన్ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నాలు భారీగా జరుగుతున్నట్టు, సోషల్ మీడియా ద్వారా పలు కథనాలు రాయటం ద్వారా బయటపడింది. ఈ విషయంపై స్పందించిన మాల్యాద్రి ఫోన్ చేసి తాను ఎ పార్టీలోకి వెళ్ళటం లేదని బిజెపి పార్టీలోనే ఉంటా అంటూ కరకండిగా చెప్పడం జరిగింది, అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాల్యాద్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశమై టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్న దృశ్యాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ఫోటోలు పాత చిత్రాల, కొత్త చిత్రాల తెలియాల్సి ఉందని పలువురు గుసగుసలు చేసుకుంటున్నట్టు చర్చ వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాల్యాద్రి రెడ్డి చేరన్నట్టు విషయం బయటపొక్కటం అదేవిధంగా ఆయన సైలెంట్ గా ఉండడం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్టు చర్చ బహిర్గతంగా వినిపిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గం నుంచి లోకల్ గా ఉన్న మాల్యాద్రి రెడ్డికి టికెట్ ఇస్తే, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి లిస్ట్ లో ఉన్న 18 మంది పరిస్థితి ఏమిటి, పార్టీని అనేక ఏళ్ల నుంచి కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీని భుజస్తంభంపై మోసుకొస్తున్న కాసుల బాలరాజ్, అంబర్ సింగ్, ఎలమంచిలి శ్రీనివాస్, కూనిపూర్ రాజారెడ్డి, పలువురి పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు చర్చించుకుంటున్నట్టు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్మోహన్రావు, సుభాష్ రెడ్డి టికెట్ నాకంటూ, నీకంటూ పోటాపోటీ పడుతున్న విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని, అయితే వీరితోపాటు బిజెపి పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటంతో ఈయన పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి మాత్రం బాన్సువాడ నియోజకవర్గంకు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం, సొంత నియోజకవర్గంలో ఎల్లారెడ్డి లోనే గెలుపు అవకాశాలు తగ్గిన ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలో ఏ విధంగా గెలుపొందుతారని పలువురు ప్రశ్నించుకోవడం చర్చి నియమించంగా మారింది. మదన్మోహన్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో టికెట్ ఇస్తారు అనే చర్చ కొనసాగుతుండగా, మదన్మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి లోనే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, బాన్సువాడకు రావడానికి సిద్ధంగా లేరని, చర్చ జోరుగా వినిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో బిజెపి పార్టీలో ఉన్న మాల్యాద్రి రెడ్డి ఆయన మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలిసే ప్రయత్నంలో ఉన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నారని చర్చ జోరుగా వినిపిస్తుంది, ఏది ఏమైనా మాల్యాద్రి రెడ్డి బిజెపి పార్టీలో చురుకుగా ఉండి ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న బిజెపి పార్టీ శ్రేణులు మాత్రం కోపదితులుగా, నిరాశలో ఉన్నారని చర్చ జరుగుతున్నట్టు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు మాల్యాద్రి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, ఎమ్మెల్యే టికెట్ ఆయనకు వస్తుందా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారా, లేక బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయనున్నారా, అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బిజెపి పార్టీలో మాల్యాద్రి రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Politics
| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది


తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.
జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.
సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.
ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.
Politics
| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి


బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు
జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం
మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.



Politics
| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది


మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం
జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.
చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.
*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం











