Connect with us

Politics

ఎమ్మెల్యేల ఓటమి కోసం ఎమ్మెల్సీల ప్లాన్ ?

janamvelugunews

Published

on

ఎమ్మెల్యేల ఓటమి కోసం ఎమ్మెల్సీల ప్లాన్ ?

జనంవెలుగు, వెబ్ డెస్క్:- అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తమదైన శైలిలో వ్యవహారం నడిపిస్తున్నారు. టికెట్ రాలేదన్న అక్కసుతో అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీ కోసమే పనిచేస్తున్నట్టు నటిస్తన్నా ఫీల్డులో మాత్రం అభ్యర్థిని ఓడించేందుకే వ్యూహాలు రచిస్తున్నారని నాయకత్వం గ్రహించింది. ఎన్నికల ప్రచారంలో ఏ ఎమ్మెల్సీ తీరు ఎలా ఉన్నదో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రగతి భవన్‌కు రిపోర్టు అందిస్తున్నాయి. టికెట్ దక్కలేదని కోపంతో పలువురు ఎమ్మెల్సీలు పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఇన్‌పుట్స్ గులాబీ బాస్‌కు చేరాయి. టికెట్ కోసం పలువురు ఎమ్మెల్సీలు చివరి నిమిషం వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చారు. దీంతో వారు నిరాశకు లోనయ్యారు. పార్టీ తరఫున కొన్ని బాధ్యతలు భుజాన వేసుకోక తప్పలేదు. అభ్యర్థులకు సహకరిస్తామని చెప్తున్నా రెండు నెలల కార్యాచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నాయకత్వం గ్రహించింది. పార్టీ సమావేశంలోనే కొద్దిమంది ఎమ్మెల్సీలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్సీల పనితీరులో మార్పు రాలేదనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అభ్యర్థిని గెలిపించే బాధ్యతను వారి భుజాన వేసినా పార్టీ ఆదేశం మేరకు సహకారం ఇవ్వడంలేదనేది తేలిపోయింది. దీనికి తోడు ఎమ్మెల్సీలు వారి అనుచరులకు నోటిమాటగా ఆదేశాలిచ్చి అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. సహకారం అందించడానికి బదులుగా ఓడించడానికి లోపాయకారీగా పనిచేస్తున్నట్లు తేలడం అధినేత ఆగ్రహానికి కారణమైంది. కుల సంఘాల లీడర్లకు ఫోన్ చేసి, వ్యతిరేకంగా పనిచేయాలని సూచించిన విషయం బాస్‌కు తెలిసిందని సమాచారం. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇదే తరహాలోనే వచ్చినట్టు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పరిహారంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ తాండూరులో అభ్యర్థిగా ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి విజయం కోసం పనిచేయడంపై దృష్టి పెట్టకుండా, కొడంగల్‌లో పోటీ చేస్తోన్న తన సోదరుడు నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకే ఆరాటపడుతున్నట్టు ప్రచారం ఉంది. తాండూరులో ఉన్న పట్నం అనుచరులు కూడా రోహిత్‌రెడ్డి వర్గానికి సహకరించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి టికెట్ రాకపోవడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్థానికంగా ప్రచారం చేయకుండా, ఎక్కువ సమయం హైదరాబాల్‌లోనే గడుపుతున్నారు. అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని తన అనుచరులకు ఫోన్ చేసి చెప్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వైఎస్సాఆర్టీపీ చెందిన ఓ స్థానిక లీడర్ ఇటీవల బీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయినా బెడిసికొట్టేలా చక్రం తిప్పారన్న కంప్లైట్స్ వచ్చాయి. ఆయన కొడుకు సైతం అభ్యర్థి విజయం కోసం పనిచేయం లేదని నిఘా వర్గాలు అధినేతకు తెలిపాయి. నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వనందుకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం అక్కడి సిట్టింగ్ అభ్యర్థి నోముల భగత్‌కు సహకరించడం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కోటిరెడ్డి కదలికలపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టి క్షేత్రస్థాయి నుంచి వివరాలను తెప్పించుకున్నది. ఆయన నెల రోజుల యాక్టివిటీస్‌ను రిపోర్టు రూపంలో సేకరించింది. అయితే భగత్ వర్గీయులే కోటిరెడ్డి వర్గంతో దూరంగా ఉంటున్నట్టు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీకి గ్రౌండ్ బలపడుతున్నదనే పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా అభ్యర్థికి, ఎమ్మెల్సీకి మధ్య గ్యాప్ రావడం పార్టీని ఆందోళనలో పడేసింది. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చాలారోజుల పాటు అసంతృప్తితో ఉన్నారు. అలిగిన ఆయనను కూల్ చేయడానికి రాష్ట్ర నేతలు వారి వంతు ప్రయత్నాలు చేశారు. చివరకు అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సహకరించేలా ఒప్పించారు. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పర్చే ప్రయత్నమూ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇందిర పేరును ఖరారు చేయడంతో సీన్ మారిపోయింది. రాజయ్యకు ఇందిర సమీప బంధువు (సోదరి వరుస) కావడంతో ఆమె గెలుపు కోసమే పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్ర నాయకత్వానికి చేరాయి. కడియం శ్రీహరి సైతం రాజయ్యపైనా, ఆయన అనుచరులపైనా ఆధారపడకుండా, వారి సహకారాన్ని కోరకుండా సొంత టీమ్‌కే ప్రయారిటీ ఇస్తున్నట్టు తేలింది. అసెంబ్లీ టికెట్ ఆశించినా ఊహించని నిరాశ ఎదురుకావడంతో అభ్యర్థికి ఉన్న గ్రౌండ్‌ను డిస్టర్బ్ చేసి సెగ్మెంట్‌లో వారి పెత్తనాన్ని కొనసాగేలా ఎమ్మెల్సీలు పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థులు గెలవకూడదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఒకవేళ అభ్యర్థులు గెలిస్తే అటు సెగ్మెంట్‌లో బలపడతారని, వారిదే పెత్తనమవుతుందని, పార్టీలోనూ హీరోలుగా చెలామణి అవుతారని, చివరకు తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళనే ఇందుకు కారణమని పార్టీ ఒక స్పష్టతకు వచ్చింది. ఈ భయంతోనే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలు పావులు కదుపుతున్నట్టు నాయకత్వం భావిస్తున్నది. పార్టీ ప్రచారానికి దూరంగా ఉండడం, అంటీముట్టన్నట్టుగా వ్యవహరించడం ఇందులో భాగమేనని గ్రహించింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading