Connect with us

Kamareddy

మనస్థాపానికి గురై కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం

janamvelugunews

Published

on

మనస్థాపానికి గురై కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం

జనంవెలుగు, బాన్సువాడ:- బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నీ ఆది నుంచి ఇప్పటివరకు తన భుజస్తంబలపై వేసుకొని అనేక కష్టాలు ఎదుర్కొని , నియోజకవర్గంలో ఓ వైపు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతిపక్ష హోదాను నిర్వర్తించి ప్రజా సమస్యలపై, గళమెత్తి ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేసి, ప్రజల మధ్య ఉన్న కాసుల బాలరాజుకు, ఈసారి జరిగే ఎన్నికల కంటే ముందు టికెట్ విషయంలో భంగపాటు కలిగిందని అధిష్టానం ఆయనకు గుర్తింపు ఇవ్వకుండా టికెట్ ఇవ్వలేదని, బాన్సువాడ నియోజకవర్గంలో టికెట్టు బీసీలకు ఇస్తామని చివరి వరకు అనుకున్న అధిష్టానం యొక్క నిర్ణయం, రివర్స్ అయిందని, చివరికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్ రెడ్డి కి ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థినీ కన్ఫామ్ చేయడం అధిష్టానం చాలా లేట్ చేసిందని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై కొన్ని రోజులు గడిచిన తర్వాత అభ్యర్థిగా ఏనుగుల రవీందర్ రెడ్డికి అధిష్టానం కన్ఫామ్ చేయడం జరిగిందని, దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో అసమతి సెగలు తగలడం జరిగిందని, బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరు అటు ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు తలనొప్పిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పుష్కలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరు, ఒకరికొకరు అనునిత్యం ఫైటింగ్ చేసుకోవడం టికెట్ విషయంలో కొట్లాటలు ఒకరికి ఒకరు నిందలు వేసుకోవడం ఒకరిపై ఒకరు ఉద్యమాలు చేసుకోవడం, ఐక్యత లోపించడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నప్పటికీ బాన్సువాడ నియోజకవర్గం లోని ఇరువు వర్గాల వారి యొక్క తీరు వల్ల ప్రజలు పూర్తి భరోసా కోల్పోతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి నియోజకవర్గ ప్రజలు వెనుకంజ వేస్తున్నారని, వీళ్ళ నుంచి కొనసాగుతున్న వర్గ పోరు ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు నిరాశ పరుస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తనకు టికెట్ రాదని భావించిన కాసుల బాలరాజు అధిష్టానం టికెట్ ప్రకటనకు ముందే నామినేషన్ వేశారు. అంతేకాకుండా ఆయన కుమారునీ తో కూడా నామినేషన్ వేయించారు. అధిష్టానం తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని స్థానికులకు టికెట్ ఇవ్వలేదని, స్థానికులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడిన కాసుల బాలరాజ్ మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష బాన్సువాడ పట్టణ కేంద్రంలో చేపట్టారు, బుధవారం ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు భాగంలో ఆయనపై కొన్ని నిందలు రావటం వల్ల ఆయన క్రిమిసంహారకమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది, గత కొద్ది రోజుల నుంచి తనపై సొంత గూటిలో ఉన్నవారు అనేక నిందలు వేస్తున్నారని ఢిల్లీ వరకు వెళ్లి టికెట్ ఇవ్వద్దని ఆందోళన చేసిన ఘటనలు, పోచారం శ్రీనివాస్ కి అమ్ముడుపోయి ఆయనకు కోవర్టుగా పనిచేస్తారని, ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టనష్టాలకు దూరంగా ఉండి టికెట్ విషయంలో అభ్యర్థి విషయంలో సొమ్ము ఒకరిది సోకొకరిది అన్న చందంగా వచ్చి టికెట్టు కైవసం చేసుకోవడం జరిగిందని, స్థానికంగా ఉండి అనేక రోజుల నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కాసుల బాలరాజుకు నిరాశ మిగిలిందని, బీసీలకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో స్థానం దక్కుతుందని భావించిన చివరి క్షణంలో బీసీలకు స్థానం దక్కకపోవడం, విచిత్రంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి కాసుల బాలరాజు జుక్కల్ నియోజకవర్గంలో సౌదాగర్ గంగారంకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డికి టికెట్ ఇస్తారని హామీ ఇచ్చి మాజీ మంత్రి షబ్బీర్ అలీ మోసం చేశారని కొంతమంది కార్యకర్తలు మంగళవారమే ఆయన వద్దకు వెళ్లారని సమాచారం, తనపై పడ్డ నిందలు, స్థానికులకు టికెట్ ఇవ్వాలంటే రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇది కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారని ఆయన ఆయనపై నిందలు రావడంతో మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి, ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే తన కుమారుడికి ఆశీర్వదించాలని, మనస్థాపానికి గురై విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో బాన్సువాడ ఆస్పత్రి నుంచి నిజాంబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాసుల బాలరాజుకు బిజెపి పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ పరామర్శించారు, నిజాంబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాసుల బాలరాజుకు చూడ్డానికి అభిమానులు, కార్యకర్తలు వేల సంఖ్యలో నిజాంబాద్ కు బయలుదేరి వెళ్లారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్‌కు వినతి

suresh sitharla

Published

on

విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్‌కు వినతి

జనంవెలుగు, కామారెడ్డి:- విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని కోరుతూ, పౌర హక్కుల కోసం పనిచేస్తున్న జాతీయ స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాల ప్రస్థానం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి (DEO)లకు CCR ప్రతినిధులు వినతి  పత్రాలు అందజేశారు. 2025–26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 12(1)(C) నిబంధనను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంచికట్ల అనిల్ కుమార్ సూచనలతో మిషన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అశోక్ కాకర్ల నేతృత్వంలో జిల్లా ప్రతినిధులు జోనల్ కార్యదర్శి కరీముద్దీన్, జిల్లా కార్యదర్శి బూర్ల శ్రవణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. భాస్కర్, మీర్జాపురం రామకృష్ణ, ఎస్.కే. సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Kamareddy

గ్రామపంచాయతీ అవకతవకలపై కలెక్టర్‌కు సీసీఆర్ నివేదిక సమర్పణ

janamvelugunews

Published

on

గ్రామపంచాయతీ అవకతవకలపై సీసీఆర్ నివేదిక కలెక్టర్‌కు సమర్పణ

జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. ఈ విషయంపై సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించి, అనేక లోటుపాట్లను గుర్తించారు. గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగానికి పైగా రిజిస్టర్లు లేని విషయాన్ని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా తెలిపారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు కూడా గుర్తించబడ్డాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినప్పటికీ, కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయి. వాటిలో కూడా నిర్వహణ సరిగా లేకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఆధారంగా తీసుకుని సీసీఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక ఫైనల్ రిపోర్టును రూపొందించి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డిపిఓలకు అందజేసింది. సీసీఆర్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేల దరఖాస్తులు, రికార్డుల తనిఖీలు చేశామని, ఎవరైనా అవకతవకలను గమనించినపుడు తమ సంస్థను సంప్రదించాలని, సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేయబడతాయని తెలిపారు. అదనంగా, ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడానికి సీసీఆర్ సంస్థ పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో నేవూరి రత్నాకర్, చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, కరీముద్దీన్, ఉత్తర తెలంగాణ జోన్-1 ప్రతినిధి బి. శ్రావణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ వసంత్ జాదవ్, కేతి మల్లికార్జున్, షేక్ ముజీబ్, నయీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

janamvelugunews

Published

on

స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

భయంతో పరుగులు తీసిన విద్యార్థులు

జనంవెలుగు, కామారెడ్డి, సెప్టెంబర్18:- కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం ఓ స్కూల్‌ బస్సులో పెను ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్ప టికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

Continue Reading