నిర్మల్
నిర్మల్ పట్టణ ప్రజలకు, పోలీసుల సూచన


నిర్మల్ పట్టణ పోలీసుల సూచన
జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్మల్ పట్టణం యందు బిజెపి పార్టీకి సంబంధించి ఎల పెళ్లి క్రషర్ రోడ్ వద్ద తేదీ 26 నవంబర్ 23న భారీ బహిరంగ సభ ఉండడం వలన మంచిర్యాల్ చౌరస్తా నుండి కనకాపూర్ విలేజ్ వరకు కడ్తాల్ జంక్షన్ నుండి సింగ్ ఇస్ కింగ్ ఢాబా హోటల్ వరకు విశ్వనాథ్ పెట్ నుండి ఎల్లాపల్లి హోండా షోరూం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కలవు. కావున ఖానాపూర్ మంచిర్యాల నుండి వచ్చే సాధారణ ప్రజలు అక్కపూర్ చౌరస్తా నుండి అక్కాపూర్ విలేజ్ వెంకటాపూర్ విలేజ్ మాధురిగా శాంతినగర్ ఎక్స్ రోడ్ నుండి మంచిరాల చౌరస్తా చేరుకోగలరు. అదేవిధంగా నిర్మల్ నుండి ఖానాపూర్ వెళ్లేవారు శాంతినగర్ ఎక్స్ రోడ్ నుండి అక్కాపూర్ రాచాపూర్ కనకాపూర్ మీదుగా వెళ్లగలరు. ఎవరైనా సాధారణ పనుల నిమిత్తం ఎలేపల్లి క్రషర్ రోడ్ నుండి మహాలక్ష్మి టెంపుల్ వరకు వచ్చేవారు వేరే రూట్ ను ఉపయోగించగలరు. నరేంద్ర మోడీ మీటింగ్ కి వచ్చేవారు బైంసా నుండి వచ్చేవారు మంచిరాల చౌరస్తా నుండి వద్ద వెంకటాపూర్ వెళ్లే రూట్లో గాయత్రి టౌన్షిప్ బ్యాక్ సైడ్ నుండి మరియు పార్కింగ్ కలదు. ఖానాపూర్, మంచిర్యాల్ జగిత్యాల్ నుండి మీటింగ్ కి వచ్చే వారు కొండాపూర్ వద్ద బ్రిడ్జ్ కింద నుండి అపర్ణ వెంచర్ యందుకు పార్కింగ్ కలదు సెంతామస్ స్కూల్ పక్కన పార్కింగ్ కలదు. అదిలాబాద్, బోథ్, ఏరియా నుండి వచ్చేవారు కొండాపూర్ బస్టాండ్ ( బైపాస్ )వద్ద పార్కింగ్ కలదు. హైదరాబాద్, నిజామాబాద్, సొన్ రూట్ లో వచ్చేవారు బైపాస్ దిగకుండా నేరుగా అపర్ణ వెంచర్ వద్ద పార్కింగ్ చేసుకోగలరు.ముఖ్య గమనిక సారంగాపూర్ నుండి వచ్చేవారు విశ్వనాథ్ పెట్, బంగాల్ పేట్ మీదుగా కాకుండా మంచిర్యాల్ చౌరస్తా మీదుగా రాగలరు (విశ్వనాథ్ పెట్, బంగాల్ పేట్ ఈ రూట్లలో వెహికల్ కు అనుమతి లేదు )
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








