నిర్మల్
విశ్వకర్మ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందివ్వాలి


విశ్వకర్మ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందివ్వాలి
జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- గత ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైన విశ్వకర్మ చేతివృత్తుల వారికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వకర్మల పాత్ర ప్రత్యేకం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన చరిత్ర పుటల్లో కిలక సందర్భల్లో మలుపులకు కేంద్ర బిందువులు విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన మారోజువీరన్న, సామజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేసాడని అన్నారు. మారోజు వీరన్న పోరాట స్ఫూర్తి కి అట, పాట మాట తీరుకు పల్లె,పట్నం, నగరం అనే భేదం లేకుండా సబ్బండవర్ణాల ప్రజలు ఆకర్షితులైనారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో వుండి కూడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా అజన్మతం బ్రహ్మ చారిగా మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి, కాసోజు. శ్రీకాంతాచారి నవ యువకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం ప్రాణాన్ని పళంగా పెట్టరు. తెలంగాణ ఉద్యమం లో విశ్వకర్మ లు ముందుండి నడిపించారు. గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులనుల ను నట్టేట ముంచారు. పేద, మధ్యతరగతి ప్రజలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు లభిస్తాయని నమ్మబలికారు. నిరుద్యోగ సమస్య కొంత వరకు పరిష్కారం అవుతుందని ఆశించిన అందరికి నిరాశే మిగిలింది. బి సి బందులో కూడా అన్ని జిల్లాలో అన్యాయం జరిగింది. మారోజు.వీరన్న, ప్రో.జయశంకర్, కాసోజు. శ్రీకాంతాచారి లు విద్యావంతులు, సామజిక స్పృహ వున్న వారు కావడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లభిస్తాయని, మైనార్టీలల్లో, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ అట్టడుగు వర్గాలకు, పీడిత కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం పైసల్లో, పాలనలో భాగం దక్కుతుందని ఆశించారు.
స్వతహాగా ఈ ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన విశ్వకర్మ (విశ్వబ్రాహ్మణ) కుటుంబాలకు చెందిన వారు కావడమే. గ్రామీణ నేపథ్యం నుంచి పట్టణాలు, భూమి పైన వ్యవసాయం, నివాసం అనేవి మొదలైనప్పటి నుండి కుల, మత ప్రాంతీయ బేధాలు లేకుండ, లాభాపేక్ష లేకుండ యావత్తు మానవాళికి వ్యవసాయానికి, కుటుంభానికి కావలసిన పని ముట్లు, గృహోపకరణాలు, శుభ, అశుభ కార్యక్రమాల్లో అవసరమైన వస్తువులు తయారు చేసి అందించిన అసామాన్యులు.
దేశ,విదేశాల్లో బడా పారిశ్రామిక వేత్తలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయడం,కార్పొరేట్ కంపెనీలు రెడిమెడ్ వ్యాపారం అనే వ్యవస్థను విస్తరించడంతో, తక్కువ పెట్టుబడి, ఎక్కువ సరుకులు తయారీ, తక్కువ ధరలకు అమ్మడం వలన చేతి వృత్తులే జీవనాధారం చేసుకుని జీవిస్తున్న విశ్వకర్మ చేతి వృత్తులు (కమ్మరి,కంచరి, వడ్రంగి, శిల్పి, స్వర్ణకార) వృత్తులు రోజు, రోజుకు అడుగంటిపోతున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అనేక మంది విశ్వకర్మ వృత్తిదారులు వృత్తులను వదిలేసి ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు, చాలా మంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక ప్రక్క రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకొప్రక్క ప్రభుత్వ రంగ, సంస్థల అమ్మివేత, గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో
ఉద్యోగుల బలవంతపు తొలగింపు, గ్రామాల్లో నీళ్ళు లేక వ్యవసాయం చేయలేక బొంబాయి, సూరత్, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలసలు పోవడం, పెద్దమనుషుల ఒప్పందాలు తుంగలో తొక్కేయడం, ఉద్యోగులకు 610 GO అమలు చేయకపోవడం, గల్లి నుండి సెక్రటేరియట్ వరకు, ఢిల్లీ వరకు ఆంధ్రుల పెత్తనం కొనసాగడం, తెలంగాణ మనుషులు, సంక్షేమం, అభివృద్ధి అంటేనే నిర్లక్ష్యం, తిరస్కారం,
అవమానాలు అన్ని కలగలిసి ప్రత్యేక తెలంగాణ,
సామజిక, ప్రజాస్వామిక, భౌగోళిక తెలంగాణ నినాదాలు తెలంగాణ సమాజాన్ని కదిలించాయి. అందులో నిజాయితీగా, చిత్త శుద్ధితో భాగంగా విశ్వకర్మ సామాజిక వర్గం తన వంతు పాత్రను పోషించింది. వందల, వేల మంది త్యాగాల ఫలితంగా అంతిమ లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఎన్నికలు జరిగాయి,
ఎన్నికల్లో గెలిచిన పాలకులు పూర్తిగా మాయమాటలు చెప్పి ఐదు సంత్సరాలపాటు కాలం గడిపారు, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ మాయమాటలు చెప్పి ఏ ప్రయోజనం, మౌలిక సదుపాయాలు కల్పించ లేదు. కనీసం మాజీ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, కులానికి ఒకడిని కుల సంఘంలో పాలక వర్గ అనుకూల వ్యక్తులతో గ్రూప్ రాజకీయాలు చేశారు, అన్ని సంఘాలు ఒక్కటిగా రావాలి అప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి. అని ఓదర్పు మాటలు, స్టేజి ల మీద ఊకదంపుడు ప్రసంగాలతో, ఇచ్చిన కాగితాలనే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం, ఉప ఎన్నికల్లో, ఎన్నికల్లో వెంట తిప్పుకొని అవసరం తిరిన తరువాత మొకం చాటేయడం చేశారు. విశ్వకర్మ సామాజిక వర్గం ఆశించిన రీతిలో గుర్తింపు, ప్రాధాన్యత కల్పించలేదు. గొట్టం, ఉసిరకాయల మూట అనే మాటలతో అవమానించడం చేశారు. వరంగల్ లో మీటింగ్ లో విశ్వకర్మ కార్పొరేషన్ కు రెండు వందల కోట్లు కేటాయింపు అని పేపర్ ప్రకటనలు నీళ్ళల్లో కొట్టుకొనిపోయాయి. విశ్వకర్మ సామాజిక వర్గం ఒక్క సారి, రెండు సార్లు మోసపోయింది, మళ్ళీ మోసపోవడనికి సిద్దంగా లేదు.మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మార్పు అనివార్యం అని విశ్వకర్మలు తమ ఓటు ద్వార తెలియచేశారు.గత ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైన చేతి వృత్తుల వారికి తగిన న్యాయం చేయాలి, విశ్వకర్మ సామాజిక వర్గం గొంతెమ్మ కోర్కెలు ఏమీ అడగటం లేదు. విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు,నిధుల కేటాయింపు చేసి, విధివిధానాల రూపకల్పన చేసి అమలు చేయాలి.
ఒక మనిషిగా బ్రతకడానికి తిండి కావాలి, అంటే చేయడానికి పని,పని ముట్లు కావాలి, చేసిన పనికి గిట్టుబాటు మజురి కావాలి, విశ్వకర్మ వృత్తుల్లోని కార్పొరేట్ కంపెనీలల్లో స్థానికుల కే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి, వుండటానికి ఇల్లు కావాలి,పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి,రోగం వస్తె నాణ్యమైన వైద్యం, భీమా సౌకర్యం కావాలి,వృద్దాప్యంలో వృత్తి కళాకారుల పెన్షన్ కావాలి, దురదష్టవశాత్తూ చనిపోయిన వారికి ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలి.గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు,వర్డ్ మెంబర్లు సర్పంచ్లు,అన్ని పదవుల్లో అవకాశం కల్పించాలి. ఇవన్నీ కొత్త ప్రభుత్వం సారథ్యంలో నైన నూతన ముఖ్యమంత్రి నెరవేరుస్తానని విశ్వకర్మ సామాజిక వర్గం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.గత పాలకులు మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి, చెప్పిందేది పాటించలేదు.ముఖ్యమంత్రి తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఆచరణ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని విశ్వకర్మ సామాజిక వర్గం ఆశిస్తున్నామని తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








