నిర్మల్
స్వయం సహాయక సంఘాలను వివరాలను లోకస్ యాప్ లో సంక్షిప్తం పూర్తి చేయండి


స్వయం సహాయక సంఘాలను వివరాలను లోకస్ యాప్ లో సంక్షిప్తం పూర్తి చేయండి
డిఆర్డిఏ ఏపీడి అరక చరణ్ దాస్


జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలను లోకస్ యాప్ లో తప్పులు దొరలకుండా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సభ్యుల పేర్లు పుట్టిన తేదీ బ్యాంకు లోన్ తీసుకున్న తేదీ వడ్డీ వడ్డీ శాతం లోన్ తీసుకున్న రోజు తదితర వివరాలను ఒకటికి రెండుసార్లు సక్రమంగా చూసుకొని లోకస్ యాప్ లో సంక్షిప్తం చేయాలని డిఆర్డిఏ ఏపిడీ అరక చరణ్ దాస్ ఫైనాన్స్ డిపిఎం శేష రావు సీసీలకు వివోఏలకు వివరించారు. గురువారం నేరడిగొండ బోథ్ మండలాలలో స్వయం సహాయక సంఘ సభ్యుల డాటా వివరాలను ఏ విధంగా సంక్షిప్తం చేస్తున్నారు. డాటా సంక్షిప్తం చేసే సమయంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, సంఘాల డాటా సంక్షిప్తం కాకపోవడానికి కారణాలను తదితర వివరాలను బోథ్ నేరేడిగొండ మండలాల సమస్య కార్యాలయంలో లోకాస్ యాప్ లో సంఘాల సభ్యుల వివరాలు సంఘాల వివరాలను చేస్తున్న వివరాలను ఏపీఎం సీసీ వివో లను మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే లోకాస్ అప్డేషన్ కోసం చాలా సమయం ఇవ్వడం జరిగిందని పని సక్రమంగా జరగడంలేదని సిబ్బందిని హెచ్చరించారు. మూడు రోజులలో లోకస్ సంఘాల యొక్క డాటా అప్డేషన్ చేయకపోతే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఏ మండలంలో ప్రగతి కనబడకపోతే ఆ మండలంలో ఉన్న ఏపీఎం సీసీ వివోఏలపై చర్య తప్పదని హెచ్చరించారు.అప్డేషన్ చేయడంలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే సి బి ఓ డి డి ఎం జి గంగాధర్ అడిగి మీ యొక్క సమస్యని నివృత్తి చేసుకోవాలని కోరడం జరిగింది. అయనా వెంట ఇన్సూరెన్స్ డిపిఎం శేష రావు తదితరులు ఉన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








