Crime
పెకాటకు అడ్డగా లక్కంపల్లి శివారు ప్రాంతాలు


పెకాటకు అడ్డగా లక్కంపల్లి శివారు ప్రాంతాలు
జనంవెలుగు, నందిపేట్:- నిజామాబాద్ రూరల్ పరిధిలోని నందిపేట మండలం లక్కంపల్లి గ్రామాల సమీపంలోని సెజ్, శివారులో పేకాట స్థావరాలు నిర్వాహకులు పేకాట నిర్వాహనకు అడ్డాలుగా మార్చుకున్నారు. పేకాట ఆడుతున్న సమయంలో పేకాట నిర్వాహకులు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి కాపాలా ఉంచుతారు. ఏసీబీ రాజశేఖర్ రాజు టాస్క్ ఫోర్స్ ఆదేశాల మేరకు సీఐ అజయ్ టాస్క్ ఫోర్సు బృందం లక్కంపల్లి శివారులో గల సేజ్, నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటస్తవరం పై టాస్క్ ఫోర్స్ దాడులు జరిపి,35,300 రూపాయలు 8మంది పెకాట రాయుల్లను అదుపులోకి తీసుకున్నారు. పేకాట దినచర్యగా మారడం, నియంత్రణ చేసే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం అంటూ ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేకాట యథేచ్ఛగా కొనసాగుతుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Crime
అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి


అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం అక్బర్ నగర్ గ్రామంలోని గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయన్న తెలిపిన వివరాల ప్రకారం, అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతిరోజూ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రుద్రూర్ పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయన్న మాట్లాడుతూ, పేకాట నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Crime
పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఏడుగురు అరెస్ట్


పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఏడుగురు అరెస్ట్
జనంవెలుగు, నందిపేట్ : నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయం పై ఎస్సై శ్యాంరాజ్ వివరాలు వెల్లడిస్తూ, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.21,600 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శ్యాంరాజ్ సూచించారు.
Crime
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సాయన్న


యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సాయన్న
జనంవెలుగు, రుద్రూర్:- యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాల విద్యార్థులకు మంగళవారం గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని, గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. అలాంటి వ్యసనాలు వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు కుటుంబాలను కూడా దుస్థితికి గురిచేస్తాయని తెలిపారు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో, క్రీడల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.