Connect with us

Birthday

మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ..!

janamvelugunews

Published

on

మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ..!జనంవెలుగు,  రుద్రూర్:- భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. చర్చకు వచ్చే పేరు.. ఛత్రపతి శివాజీ. అచంచలమైన దేశ భక్తుడిగా, శత్రువుకు తలవంచని ధీరుడిగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా, పరమత సహనం గలిగిన ఉదారవాదిగా, గొప్ప మానవీయ విలువలకు ప్రతీకగా ఛత్రపతి శివాజీ మనకు కనిపిస్తాడు. మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి, మరాఠాల ఘనతను చాటిచెప్పిన వీరుడిగా, పౌరుషానికి ప్రతీకగా, పోరుబాటలోని యువతకు గొప్ప ఆదర్శంగా నిలిచిన మార్గదర్శి శివాజీ. నేడు శివాజీ జయంతి సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలాలు వేసి మిఠాయిలు పంచి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణం నుండి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించి భారతదేశంలో మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ జాతి సూరిడు, భరతమాత ముద్దు బిడ్డ, ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి మారుపేరు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ పత్తి రాము, విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశాంత్ గౌడ్, అనీల్, గణేష్, వినోద్, శ్రీను స్వామి, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Birthday

|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

janamvelugunews

Published

on

నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…

నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.

సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.

Continue Reading

Birthday

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక

జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.

Continue Reading

Birthday

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

janamvelugunews

Published

on

PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి

జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.

Continue Reading