Connect with us

Politics

బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సబ్ కమిటీ

janamvelugunews

Published

on

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

– రైతులతో ముఖాముఖి భేటీ…

నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

జనంవెలుగు, బోధన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సందర్శించింది. నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పి.భూపతి రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిల్లరీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి, ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు, నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత 2015 లో లే ఆఫ్ గా ప్రకటించబడి మూతబడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం రైతులు, రైతు సంఘాల నాయకులతో ముఖాముఖిగా భేటీ అయిన కమిటీ సభ్యులు, వారి అభిప్రాయాలను సేకరించారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు హర్షం వెలిబుచ్చుతూ, కర్మాగారం పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కమిటీ దృష్ఠ్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరుకావడం జరిగిందన్నారు. రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి, లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు. రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ అభిమతమని, ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పరిస్థితులు ఎలా ఉంటాయి, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటీ అనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, అవసరమైతే రైతులను హైదరాబాద్ కు కూడా పిలిపించి చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామిక నిపుణులతోనూ చర్చిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణం వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా కల్పించారు. ఫ్యాక్టరీని తెరిపించించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే రైతులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండే వాస్తవ పరిస్థితులను తెలుపుతూ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు హామీలైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 27 న మరో రెండు హామీలైన రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇదే కోవలో రైతులకు ఇతోధికంగా మేలు చేకూర్చాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరుపుతోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే దిశగా ముందుకెళ్తోందన్నారు. దీనివల్ల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తృతికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపడతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కోసం మరో పది రోజుల్లోనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు. సబ్ కమిటీ భేటీలో నిజాం షుగర్స్ ఎం.డీ డాక్టర్ మక్సూద్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మశరత్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, రైతులు, రైతు నాయకులు, కార్మికులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు బొకేలు అందించి స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading