నిజామాబాద్
ఏసీపి కిరణ్ కుమార్ కు ఘన సన్మానం


ఏసీపి కిరణ్ కుమార్ ను సన్మానిస్తున్న దృశ్యం
జనంవెలుగు, రుద్రూర్, ఫిబ్రవరి 25 : బోధన్ ఏసీపీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన కిరణ్ కుమార్ ను ఆదివారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ అతిథి గృహంలో జరిగిన వీడ్కోలు అభినందన సభలో రుద్రూర్ మండల సోసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము, పార్వతి సుధీర్ లు కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏసీపి కిరణ్ కుమార్ సేవలు అభినందనీయమని వారు కొనియాడారు.
నిజామాబాద్
| Balkonda లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.


లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.
మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి.
జనం వెలుగు బాల్కొండ:- రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తున్న లక్ష రూపాయలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకి చ్చిన హామీల భాగంగా ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వే ముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల మంజూరి కోసం 127 ఫైల్లపై శనివారం ఆయన సంతకాలను చేశాడు. బాల్కొండ 19, వేల్పూరు 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీంగల్ 39 మండలాలకు చెందిన ఫైల్లపై బాల్కొండ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఫైల్లను పరిశీలించి ఆయన సంతకాలను చేశాడు. ఫైల్లను మీ వద్ద పెండెంగ్ ఉంచకుండా అవసరమైన సంతకాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపించాలని తహసిల్దార్ లను ఆయన ఆదేశించాడు.
నిజామాబాద్
| Armoor మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.


మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.
ఎంల్ఏ, చైర్ పర్సన్ ల ముందరే ఇరువర్గాల నాయకుల పరస్పర దూషణలు.
బిజెపి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేష్.
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బిజెపి నాయకులు, కాంగ్రెసు నాయకుల మధ్య రచ్చ రచ్చ జరిగిన ఘటన ఆర్మూర్ లో చర్చ నీయాం శంగా మారింది.ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సా ధారణ సమావేశం జరిగింది. ఇట్టి సాధారణ సమావేశానికి హాజర య్యేందుకు వచ్చిన ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ గోనె లహరి చాంబర్ లో ఆశీనలై ఉండగా బిజెపి, కాంగ్రెసు నాయకుల మధ్య జరిగిన మాట మాట పెరిగి పోయి రచ్చ రచ్చగా మారిపోయింది.ఎంఎ ల్ఏ అనుచరుడు మందుల బాలు తమపై పెత్తనం చలాయించడం ఏమిటని కౌన్సిలర్ రమేష్ తీవ్రంగా పరిగణించి ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కౌన్సలర్ అయిన నాతో దుర్బాషలాడి బయటకు వెళ్ళాలని నాపై మందుల బాలు హుకుం చెలాయించడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. ఒక మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన ఈ తతంగం ఒక ఉద్రిక్తత వాతావరణంలా మారింది. అటు అధికారులు గాని ఇటు పోలీసులు గాని ఇటు బిజెపి నాయకులను గాని అటు కాంగ్రెసు నాయకులను ఏమి అనలేక వినలేక మౌనం పాటించడం వలన మున్సిపల్ కార్యాలయం అంతా గందరగోళంగా ఉద్రిక్తతంగా మారి పోయింది.తమ కక్షల కు కార్పణ్యాలకు మున్సిపల్ కార్యాలయాన్ని ఓ వేధికగా చేసుకుని మాటల తూటాలతో పెరిగి పోయి నాయకులు కొట్టుకునే స్థాయికి చేరింది.ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలకే ఇరు నాయకులు పెద్ద పీట వేసినట్లు వారి దూషణలు స్పష్టత నిచ్చాయి.
నిజామాబాద్
| nandipet పేకాట స్థావరాలపై మెరుపు దాడి


పేకాట స్థావరాలపై మెరుపు దాడి
జనం వెలుగు, చిలాప్చెడ్ (18 ఏప్రిల్ 2026): గ్రామంలోని చర్చి వెనుక పేకాట జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు శనివారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 5:45 గంటలకు సమాచారం అందడంతో ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకుని, 6:00 గంటల సమయంలో నలుగురు వ్యక్తులను పేకాట ఆడుతూ పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుండి రూ.4,410 నగదు, మూడు మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, Cr.No.39/2026 U/s 9(i) టీజీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.








