Education
కళా వైభవాన్ని చాటిచెప్పిన అల్ఫోర్స్ సాంప్రదాయ్


జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అనిల్ గంటడి:- సాంస్కృతిక కార్యక్రమాలతో ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని మరియు కార్యకలాపాలను ఉత్సాహంగా పూర్తి చేయవచ్చనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు మరియు, బి.జె.పి శాసనసభాపక్ష నేత, డా|| ఎ.రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా||వి.నరేందర్ రెడ్డితో కలిసి స్థానిక ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో ఆకాశమే హద్దుగా వైభవంగా నిర్వహించినటువంటి “అల్ఫోర్స్ సాంప్రదాయ్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు” కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వారు చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూల మాల వేసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను దిగ్విజయంగా ప్రారంభించారు.ప్రతి ఒక్కరు తరగతి గదుల్లో చాలా ఉత్తమంగా వ్యవహరించి, శ్రద్దతో, ఏకాగ్రతతో అధ్యాపకులు భోదించే విషయాలను తు.చ. తప్పకుండ విని విశ్లేషించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లిలకు కావల్సిన వనరులను సమకూర్చి వారిని అగ్రగామిగా నిలుపేందుకు ప్రోత్సాహం అందించి సాధించే దిశగా పయనించాలను సూచించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నరేందర్ రెడ్డి గారి సారాధ్యంలో విద్యార్థులు సంచలన విజయాలను నమోదు చేయడం చాలా గొప్పవిషయమని మరియు ప్రారంభం నుండే అత్యుత్తమ కీర్తిని స్వంతం చేసుకోవడం వారి వ్యవహరా శైలికి ఒక గొప్ప నిదర్శనమని అభివర్ణించారు. డా||ఎ.రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్, మాట్లాడుతూ నేడు ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన చంద్రయాన్-3 ని అభివృద్ధి చేయడంలో ఐ.ఐ.టి విద్యార్థులు చాలా కీలకంగా వ్యవహరించి దాన్ని విజయవంతం చేయడంలో పాత్రులు అవడం చాలా గొప్ప విషయమని చెప్పారు. అతి చిన్న వయస్సులోనే విద్యార్థులు కఠోర శ్రమతో ప్రణాళిక బద్ధంగా తరగతులను వింటు చెప్పిన విషయాలను సాధన చేస్తు ముందుకు కొనసాగుతున్నారని చెప్పారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 34 సం.. లుగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎనలేని కృషి చేస్తుందని మరియు విద్యాభివృద్ధికై నూతన ఒరవడిని సృష్టిస్తు సమాజంలో మార్పులకు అనుగుణంగా మరియు ప్రవేశపెడుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం జరుగుతుందని చెప్పారు. ప్రతిఒక్కరు నైతిక విద్యతో పాటు నైతికల విలువల పట్ల శ్రద్ద వహించి ఆదర్శంగా వ్యవహరించాలని కోరారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ మై ఫ్రెండ్, జయ్ సియరామ్ జయ్ జయ్ సియరామ్, గువ్వాగోరింకతో, చలియా చలియా. నృత్యాలు చాలా అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నరు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








