Crime
తృటిలో తప్పిన ప్రమాదం


తృటిలో తప్పిన ప్రమాదం
ఎటువంటి నష్టం జరిగినా అధికారులదే భాద్యత
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామ శివారులోని గోదావరి పరివాహక ప్రాంతాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది సంఖ్యలో భారీ వాహనాలతో నల్ల మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. మితిమీరిన వేగంతో భారీ వాహనాలను నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నందిపేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సి హెచ్ కొండూర్ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న తిప్పర్లోంచి పెద్ద మట్టి ముద్ద పక్కనే పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్థానికి అధికారులకు చరవాణిలో తెలపగా అధికారులు మాకేం తెలియదన్నట్టుగా వ్యవహారించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భారీ వాహనాలతో ఎటువంటి నష్టంగాని, ప్రాణాహానిగాని జరిగినా పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని హెచ్చరించారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









Rithvik
April 13, 2024 at 5:37 am
మీ మీడియా రైతుల భాద చూస్తే బాగుంటది.. మట్టి తిప్పర్ల వాళ్ళ పై కంప్లెట్ చేస్తే అధికారులు మట్టి లారీ లను నిలిపివేస్తారు హా ప్రభావం రైతులపై పడుతుంది దయచేసి మట్టి లారీలపై రాయడం నిలిపివేయండి.కెజివిల్ ట్రాక్టర్లు తిరుగుతే ఒక్కడు స్పందించాడు కెజివిల్ ట్రాక్టర్ లకు ప్రత్యేమ్నాయము ఉంది రైతులు వాడుతాలేరు మరి మట్టికి ఉంటే చెప్పండి..మీడియా అనేది సమాజ మార్పు చేయలకని
సమాజనికి కళంకిత కాకూడదు
Rithvik
April 13, 2024 at 5:39 am
మీడియా రైతుల భాద చూస్తే బాగుంటది.. మట్టి తిప్పర్ల వాళ్ళ పై కంప్లెట్ చేస్తే అధికారులు మట్టి లారీ లను నిలిపివేస్తారు హా ప్రభావం రైతులపై పడుతుంది దయచేసి మట్టి లారీలపై రాయడం నిలిపివేయండి.కెజివిల్ ట్రాక్టర్లు తిరుగుతే ఒక్కడు స్పందించాడు కెజివిల్ ట్రాక్టర్ లకు ప్రత్యేమ్నాయము ఉంది రైతులు వాడుతాలేరు మరి మట్టికి ఉంటే చెప్పండి..మీడియా అనేది సమాజ మార్పు చేయలకని
సమాజనికి కళంకిత కాకూడదు