ARTICLE'S
బాల బాలికల భవిష్యత్తును చిదిమేస్తున్న దుండగులు. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు,
బాల బాలికల భవిష్యత్తును చిదిమేస్తున్న దుండగులు. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు, తల్లితండ్రులు, సమాజం. అశ్లీలదృశ్యాలు అక్రమార్జన, అక్రమ రవాణా, టీవీ సినీ ప్రసారాలతో పాటు క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, మద్యం కూడా ప్రధాన కారణాలే !
వడ్డేపల్లి మల్లేశం 9014206412
జనం వెలుగు న్యూస్:- దేశానికి స్వాతంత్రం వస్తే స్వరాజ్యంలో సాధికారత ప్రధాన లక్ష్యంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో పరిపాలన కొనసాగిస్తామని స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకులు ఆలోచించినారు . తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం నిరంకుశ పాలనతో పాటు రజాకారుల దౌర్జన్యాలను అడ్డుకొని నిర్మూలించగలిగితే స్వేచ్ఛ జీవితం గడపవచ్చునని ఆనాటి పోరాట యోధులు తీర్మానించినారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాల ఆవిర్భావానికి సంబంధించిన పోరాట క్రమంలో కూడా స్వరాష్టములో నిధులను సక్రమంగా ఉపయోగించుకుని స్వావలంబన దిశగా కొనసాగవచ్చునని కలలుగన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నాలుగు ప్రధానమైన ఆకాంక్షలు కేంద్రంగా 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉత్కృష్ట స్థాయిలో రాష్ట్రాన్ని నిలబెడతానని పెద్దలు హామీ ఇచ్చినారు .
పై అన్ని సందర్భాలలోనూ పోరాటం జరిగి, కర్తవ్యాన్ని నిర్వహించి, లక్ష్యాన్ని చేరుకున్నాము కానీ పోరాటం చేసి అధికారాన్ని సాధించినటువంటి స్వదేశీయులు. స్వరాష్ట్రపాలకులు ఇచ్చిన మాట మరచి, ఆకాంక్షల విస్మరించి, ఆధిపత్యాన్ని చలాయిస్తూ, వికృత పరిపాలన కొనసాగిస్తున్న కారణంగా నేడు భారతదేశము అన్ని రంగాలలోనూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రపంచ స్థాయిలో భారతదేశం సమస్యల వలయంగా తయారైనది అనడంలో సందేహం లేదు. అందులో ప్రధానంగా చిన్నారుల మీద జరుగుతున్నటువంటి దాడులు, లైంగిక కేసులు, అపహరణ, హత్యలు , అత్యాచారాలకు అంతే లేకుండా పోయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతను మోయవలసిన అవసరం ఉన్నది . కర్తవ్యాన్ని విస్మరించి, రాజకీయ లబ్ధి, స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కారణంగా నేడు అధికార పార్టీతో సహా అనేక రాజకీయ పార్టీలు నేరస్తులుగా మారుతున్నటువంటి విచిత్ర సన్నివేశాన్ని భారతదేశంలో చూడవచ్చు.ముఖ్య0గా బలవుతున్నది పేద, అట్టడుగు, ఆదివాసీ,దళిత,బహుజనవర్గాలే కావడాన్ని గమనిస్తే ఆధిపత్య వర్గాలు పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా భావించవచ్చు. ఈవిషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. లోక్సభలో 83 శాతం మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు ఉన్నారంటే ఇక పరిపాలన ఏ రకంగా ఉంటుందో, ప్రజలకు రక్షణ ఎలా సాధ్యమవుతుందో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది .
చిన్నపిల్లల్ని చిదిమి వేయడం పట్ల సమాజం సిగ్గుపడాలి:-
ప్రతి విషయంలోనూ నంబర్వన్ అని గర్వంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రావిర్భావం తర్వాత 8 సంవత్సరాలు ముగిసినప్పటికీ బాల కార్మికులకు సంబంధించి గత సంవత్సరం దేశవ్యాప్తంగా 982 కేసులు నమోదు కాగా అందులో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 305 కేసులు నమోదై బాల కార్మికులకు నె లవైన రాష్ట్రంగా కొనసాగడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు ? బాల కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రం కూడా దేశంలో నంబర్వన్ అని ప్రభుత్వం అంగీకరిస్తుందా ?బాల కార్మిక వ్యవస్థకు బాల్య వివాహాలకు అవినాభావ సంబంధం ఉన్న విషయాన్ని గమనిస్తే విద్యారంగానికి దూరం చేస్తూ కుటుంబ పెద్దలు తమ భారాన్ని తీర్చుకునే ప్రయత్నంలో చిన్నారుల జీవితాన్ని తల్లిదండ్రులే చిదిమి వేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ గమనించవచ్చు. బాల్య వివాహానికి సంబంధించిన కేసులు గత సంవత్సరం 10 62 నమోదు కాగా కర్ణాటక తమిళనాడు అస్సాం మొదటి మూడు స్థానాల్లో నిలవడాన్ని మనం గమనించవచ్చు . అంటే ఆ రాష్ట్రాలలో బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేయని కారణంగా ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడినట్లు గమనించాలి.
పిల్లలపై లైంగిక నేరాలు / ఫోక్సో చట్టం :-
రోజురోజుకు దేశంలో పిల్లల పైన నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న విషయం పట్ల జాతీయ నేర రికార్డుల బ్యూరో( ఎన్ సి ఆర్ బి) ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరం కావడం పట్ల విస్మయం వ్యక్తం చేయడం జరిగింది . పసి పిల్లల పైన లైంగిక నేరాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల చేసిన ఫోక్సో చట్టం ( లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) కింద దేశవ్యాప్తంగా 2021 వ సంవత్సరంలో 53,874 కేసులు నమోదైనట్లు 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ నేరాల సంఖ్య మొత్తం 1,28,531 కాగా 2021 సంవత్సరంలో ఆ సంఖ్య 1,49404కు పెరిగింది. 2021 సంవత్సరంలో ఫోక్సో చట్టంలోని సెక్షన్ 4 6 ప్రకారంగా లైంగిక దాడి తీవ్రమైన లైంగిక దాడి కింద 33,348 కేసులు నమోదు కాగా అందులో బాలికలపై జరిగిన ఘోరాలు 330 36 కాగా బాలురపై కూడా 312 దాడులు జరగడాన్ని గమనిస్తే ఈ సమాజం ఎటువైపు వెళుతుందో దుండగుల ఆలోచన ఏరకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కిడ్నాపింగ్లు, హత్యలు, అత్యాచారాలు :-
సమాజం సిగ్గుతో తలవంచుకునేలా చిన్నపిల్లల పైన లైంగిక దాడులతో పాటు కిడ్నాప్ చేసి దాడులతోపాటు హత్య అత్యాచారం వంటి కేసులను ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా చూడవచ్చు. కారణాలను గుర్తించకుండా ,గుర్తించిన కారణాలను నిర్మూలించకుండా, ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కారణంగానే ఈ కేసులు ఎక్కువగా జరుగుతున్నట్లు మేధావులు మానసికవేత్తలు చెప్పినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలా లేదు. అందుకే అనేక పేద కుటుంబాల పిల్లలు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు అనేది సామాజిక విశ్లేషకులు అభిప్రాయం. జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్ సి ఆర్ బి వెలువరించిన గణాంకాల ప్రకారం గత సంవత్సరం పిల్లల కిడ్నాప్ కు సంబంధించి 67245 కేసులు నమోదు అయితే ఆధారాలు లేక తప్పిపోయినటువంటి మరో 29364 మంది పిల్లలు కూడా అపహరణకు గురైనట్లుగా సంబంధిత అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా గత సంవత్సరం 10 46 మంది పిల్లలు అక్రమ రవాణాకు గురికాగా ఇతర ప్రాంతాలకు పంపించబడి చేయని జ్రానికి శిక్ష అనుభవించి తల్లిదండ్రులకు దూరమైన హృదయ విదారక గాథలను కూడా మనం గమనించవలసి ఉంటుంది . ఇక జరుగుతున్నటువంటి నేరాల రేటును పరిశీలించినప్పుడు 2020 సంవత్సరంలో 28.9% ఉంటే 2021లో 33 6 శాతానికి పెరిగిపోయి0ది. 2021 లో 140 మంది చిన్నారులను అత్యాచారం చేసి హత్య చేయగా మరో ఒకవేళ 1402 మంది చిన్నారులను హత్య చేసి తమ అక్కసు తీర్చుకున్న దుండగులను పట్టుకోకుండా పట్టించుకోకుండా ప్రభుత్వాలు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నవి.
ఇక స్వార్థం మగ పిల్ల వాళ్ల కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో పిండ దశలోనే ఆడపిల్లలను చంపుతున్న తల్లిదండ్రులు ,వైద్యుల యొక్క దాస్టీకాన్ని గమనిస్తే భ్రూణ హత్యల్లో మధ్యప్రదేశ్ అత్యధికంగా 121 కేసులు గుజరాత్ లో 23 చత్తీస్గఢ్లో 21 రాజస్థాన్లో 13 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా చిన్న పిల్లల పైన కుటుంబ సమకాలిన వయస్సు గల వారి తో సహా పాఠశాలలు విద్యారంగం ఒత్తిడి కారణంగా కూడా అనేకమంది చిన్నారులు ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అనేకమంది చిన్నపిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను బాల్య దశలోనే అపహరించి, కొన్ని కేంద్రాలలో పెంచి పోషించి, వ్యభిచార కూపం ఇతరత్రా పనులకు వాడుకోవడానికి కొన్ని ఏజెన్సీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే పిల్లల అపహరణ . 2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అపహరించబడిన పిల్లల సంఖ్య 49,535 కాగా వాటిలో మహారాష్ట్రలో 9415 మధ్యప్రదేశ్లో 8224 ఢిల్లీలో 5345 ఒడిస్సాలో 5135 బెంగాల్లో 4026 కేసులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ రకంగా అపహరణకు గురైనటువంటి పిల్లలు అగ్ర భాగం తమ కుటుంబాలను చేరుకునే అవకాశం లేకుండా మధ్య దళారులు నిర్బంధించి మురికి కూపాల్లోకి నెట్టి ఆదాయం సంపాదించుకునే అక్రమ మార్గాలలో వీరిని వినియోగించడాన్ని మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం.
ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి :-
కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అతి ఉత్సాహంగా సుమారు నెలరోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహించినప్పటికీ దేశంలో జరుగుతున్నటువంటి బాలల లైంగిక దాడులు, అపహరణ , అక్రమ రవాణా వంటి విషయాలపైన ఏనాడు చర్చించిన దాఖలా లేదు. ఈ అన్యాయాన్ని నేరాన్ని ఈ ఘోరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా రోజురోజుకు సంఖ్య పెరుగుతూనే ఉన్నది . ప బ్బులు క్లబ్బులు, ఈవెంట్లు , సినీ సాహిత్యం అశ్లీల దృశ్యాలు టీవీ సినీ ప్రసారాలు, కుటుంబ పరమైన విద్యాపరమైన ఒత్తిడి తో పాటు, నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ధోరణులు, తల్లిదండ్రుల స0రక్షణలోని వైఫల్యం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అనేకమంది బుద్ధి జీవులు మానసిక వేత్తలు అత్యాచారాలు జరగడానికి లైంగిక దాడులకు ప్రధాన కారణం సామాజికంగా నిజజీవితంలో వివిధ సందర్భాలలో సినిమా టీవీ ప్రసారాలు క్లబ్బులు ఈవెంట్ లోని నృత్యాలు అంగాంగ ప్రదర్శన వంటివి కూడా కారణాలు అని చెప్పినప్పటికీ , మద్యపానం ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ ప్రభుత్వాలు ఆదాయ మార్గాన్ని మాత్రమే వెతుకుతున్నాయి కానీ చిన్నారుల జీవితాలకు భరోసా ఇవ్వడం లేదు. న్యాయవ్యవస్థ కూడా పరిమితి విధించడమే తప్ప ఈ అంశాల పైన పూర్తిగా నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం లేదు. పౌర సమాజం కూడా తమ ప్రవర్తనను సంస్కరించుకొని మానసిక పరివర్తనతో, నైతిక విలువలకు కట్టుబడి తోటి మనిషిని సాటివారిగా చూసే విధంగా సమాజ సంస్కరణకు పూనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలు ఘోరాలు ముఖ్యంగా పసిపిల్లల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఫోక్సో వంటి అనేక చట్టాలు ఈ దేశంలో అమలులో ఉన్నప్పటికీ కనీసం ఒక్క శాతం కూడా నిర్మూలించలేకపోతున్నాము. అడ్డుకోలేకపోతున్నాము. ఇది అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం . చిదిమి వేయబడుతున్న పిల్లలు అంతా సమాజానికి చెందిన వారేనని ,మన కుటుంబ సభ్యులేనని సోయి , జ్ఞానము, మానవతా దృక్పథం ప్రజలందరికీ ఉన్ననాడు చట్టాలు తమ పని తాము చేసుకుంటూ, నేరస్తులు ఎంతటి వారైనా శిక్షకు గురి చేసిన నాడు తప్పకుండా పిల్లలపై జరుగుతున్న దాడులు లైంగిక నేరాలు కిడ్నాప్లు హత్యలు అత్యాచారాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా మనందరం సామూహిక కృష్నని కొనసాగిద్దాం. పాలకులపై ఒత్తిడి తెద్దా0. నేటి బాలలను బతికించుకుందాం. రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుదాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










