ARTICLE'S
హిందీయేతర భాషల అణచివేతకు నిరసనగా భారత రాష్ట్రపతికి ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహా విజ్ఞాపన


జనం వెలుగు:- ఉన్నట్టుండి సాధారణ సాంకేతిక ఉన్నత విద్యల బోధనలూ, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ప్రవేశ పరీక్షలూ హిందీలోకి మార్చే తొందరపాటు ప్రయత్నం ఒకటి సాగుతున్నట్లు వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలను ,తనలాంటి తెలుగు భాషాభిమానులను మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ
ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాన లేఖల పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం హిందీయేతర భాషా ప్రజలకు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు చాల నష్టాన్ని కలుగ చేస్తుందని ఈ నిర్ణయం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వక్రీకరణగా ప్రజా నేస్తం తెలుగుజాతి ఆత్మగౌరవ పోరాట యోధుడు ప్రజా నేస్తం బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
అనేక భాషా జాతుల ప్రజలున్న భారతదేశంలో తెలుగుతో సహా 22 భాషలను భారత రాజ్యాంగ చట్టం గుర్తించింది. అని హిందీ, ఇంగ్లీషు భాషలను కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు అధికార (Official & Associate Official) భాషలుగా ఉపయోగిస్తున్నారు.కొంతకాలం తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్యను బోధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రలలో అన్ని స్థాయిల విద్యార్థులు ఎక్కువ శాతం ఇటీవల కాలంలో ఇంగ్లీషు మాధ్యమంలోనే విద్య నేర్చుకుంటున్నారని,ప్రస్తుతం 3. హిందీ భాష గురించి పార్లమెంటరీ స్థాయీ సంఘం తీసుకున్న పై నిర్ణయం వలన తెలుగు విద్యార్థులకు ఇంగ్లీషు ద్వారా గోడదెబ్బ , హిందీ ద్వారా చెంపదెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడుతోందని తెలుగు భాష ప్రేమికుడు ,తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రజా పోరాటాల ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి రాసిన మహా విజ్ఞాపన లేఖల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామిక యుగస్పూర్తిని అనుసరించి భాషలన్నీ సమానమైనవే అనే సూత్రీకరణ నూ, ఒకనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన అలాంటి హామీలను పై సిఫారసు పూర్తిగా నిరాకరిస్తోందని తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున భారత రాష్ట్రపతికి రాసిన లేఖల ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.
ఈ తరహా సిఫార్సులు చేసే ముందు సమస్త భాషల ప్రజల నడుమ చర్జరగాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజాస్వామికంగా చర్చించి, అసెంబ్లీలలో ఆమోదం పొందాలని , చివరకు భారత పార్లమెంటులో విస్తృతంగా చర్చలు జరిపిన పిదప ఒక ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోవాలని సామాజిక పరివర్తకుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపారు.
మార్పులు ఏవైనా జరగవలసి ఉంటే క్రింద స్థాయి నుండి పై స్థాయికి ఒక క్రమంలో అమలు జరగాలి తప్ప ఆకస్మిక నిర్ణయాలు చాలామందిని నష్ట పరుస్తాయని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాదవ్ స్పష్టం చేశారు.
తల్లి భాషలో చదువులను, పరిపాలనను, ప్రవేశ పరీక్షలను తెలుగు భాషాభిమానులుగా మేము స్వాగతిస్తున్నామని బోరన్నగారి నేతాజీ సుభాష్ రాష్ట్రపతి గారికి పంపిన మహా విజ్ఞాపన లేఖలో తెలిపారు.
కేంద్రీయ సర్వీసులలో ప్రవేశ పరీక్షలకు అన్ని గుర్తింపు పొందిన మాతృభాషలకు అవకాశం ఉండాలన్న తెలుగు భాష ప్రేమికుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ ,60 ఏళ్లకు పూర్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర ప్రాంతాల వారు కోరుకున్నంత కాలం, కేంద్ర – రాష్ట్ర పరిపాలనకు సంధాన భాష (Link Language) గా ఇంగ్లీషు కొనసాగాల అని సిపి ఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాపన లేఖలో డిమాండ్ చేశారు. విద్య నుండి తెలుగు మాధ్యమం (మీడియం)లో చదువులు లేని పరిస్థితి అమలు జరుగుతోందని బోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు 9. ప్రపంచ వైజ్ఞానిక శాస్త్రాల అధ్యయనానికి తప్పనిసరి అవసరమైన ఇంగ్లీషు భాషను మాతృభాషల ద్వారా నేర్పే నైపుణ్యవంతమైన మంచి సులువు పద్ధతులను అమలు పరచాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతిని కోరారు.
కేంద్రీయ సర్వీసులలోనూ, సంస్థలలోనూ ఆయా భాషల జనాభా దామాషా (proportionate) ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉండాలని బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి పంపిన లేఖలు విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాలలో ఈనాటికీ తెలుగులో పరిపాలన జరగని పరిస్థితిలోనూ, తెలుగు మాధ్యమంలో బోధన లేకపోవడం వల్లనూ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో, పోటీ పరీక్షలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల చదువులలో రాణించలేని పరిస్థితి ఏర్పడిందని సుభాష్ పేర్కొన్నారు. హిందీ మాతృభాషలో పరీక్షలు రాయగలిగే పోటీదారులతో సమంగా పోటీలో నిలవలేకున్నారని ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీషు భాషలోనే ఉమ్మడి పరీక్షలు రాసే పద్ధతి ఇంకా కొనసాగాలన్నారు సుభాష్ .లేకుంటే తెలుగుతో సహా అన్ని భాషల విద్యార్థులకు శిశు విద్యా బోధన కాలము నుండి వారి వారి మాతృభాషల మాధ్యమంలోనే కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు బోధించే పద్ధతి మొదట అమలు జరిగేట్లు చూసి, ఆ తర్వాత మాత్రమే పై సూచనలు అమలులోకి తేవాలని ప్రజా నేస్తంభొరన్నగారి నేతాజీ సుభాష్ పేర్కొన్నారు.
హిందీ యేతర విద్యార్థులకు పనిగట్టుకుని అననుకూల పరిస్థితులను సృష్టించే పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకోకుండా చూడాలని తెలుగు భాష పరిరక్షణ పోరాటయోధుడు , ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ భారత రాష్ట్రపతికి పంపిన మహా విజ్ఞాపన లేఖలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుభాష్ కోరారు.
కేంద్ర హోం శాఖా మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న పార్లమెంటరీ స్థాయి అధికార భాషా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ప్రజాస్వామిక చర్చల ద్వారా నిర్ణయాలు జరిగేటట్లు చూడమని గౌరవ రాష్ట్రపతికి తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున తెలుగు భాష ప్రేమికుల తరఫున ప్రజా నేస్తం తెలుగు భాష పరిరక్షణ ఉద్యమకారుడు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 భారత రాష్ట్రపతికి రాసిన మహా విజ్ఞాపన లేఖలో సుభాషన్న విజ్ఞప్తి చేశారు . భారతీయ భాషలన్నీ సమానమే అనే ప్రజాస్వామిక సూత్రానికి భిన్నంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిందీయేతర భాషల పట్ల వివక్ష చూపుతున్నదని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా, భారత రాష్ట్రపతికి తెలుగు భాషా అభిమానులు , ప్రజా ఉద్యమకారులు , కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు భారత రాష్ట్రపతికి పోస్ట్ కార్డుల ద్వారా లేఖలు పంపాలని సుభాషన్న విజ్ఞప్తి చేశారు.ఇది సరిహద్దులతో నిమిత్తం లేకుండా , కుల, మత, రాజకీయ , ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరి బాధ్యతగా ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని తెలుగు భాషాభిమాన్యుడు, వామపక్ష , ప్రజాతంత్ర , లౌకిక ఉద్యమకారుడు , సామాజిక పరివర్తకుడు కుల నిర్మూలన కోసం ,మతసామరస్యం కోసం గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నూతన ప్రజాస్వామిక విప్లవకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ 8328277285 సమస్త తెలుగుజాతి ప్రజలకుకి విజ్ఞప్తి చేశారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










