Connect with us

Crime

యదేచ్చగా అక్రమ కట్టడాలు

janamvelugunews

Published

on

●యదేచ్చగా అక్రమ కట్టడాలు

●అధికారుల మధ్య సమన్వయ లోపం

●ప్రభుత్వ ఆదాయానికి గండి

●చోద్యం చూస్తున్న అధికారులు

●అనుమతులు లేకున్నా ఉన్నాయన్న కార్యదర్శి

●చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ పరిధిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అసలు అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేక హాయిగా నిద్రపోతున్నారా తెలియని పరిస్థితి. అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలపై లక్కంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిని జనం వెలుగు ప్రతినిధి వివరణ కోరగా గతంలో పనిచేసిన కార్యదర్శి, పాలకులు పర్మిషన్లు ఇచ్చారని ఆ కట్టడాలకు నాకు ఎలాంటి సంబంధం లేదని దులిపేసుకున్నారు. ఇదే విషయమై పై అధికారుల వివరణ కోరగా కట్టడాలకు ఎలాంటి అనుమతులు లేవని ఘంటపదంగా తెలిపారు. అక్రమ కట్టడాలు జరుగుతున్న వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు అధికారులు వివరించిన తీరులో సమన్వయ లోపం కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది. కార్యదర్శి చెప్పిన మాటలకు ఎలాంటి పొంతనలేదు. ఇంత జరుగుతున్నా కార్యదర్శి నిమ్మకు నీరేత్తిన్నట్టుగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యదర్శికి భారీ ముడుపులు ముట్టినట్లుగా స్థానికుల గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత లేని పాలనకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటారో లేక ఇది ఇంతే అని పై అధికారులు కూడా బాధ్యతలను గాలికి వదిలేస్తారో వేచి చూడాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

janamvelugunews

Published

on

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Continue Reading