Crime
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం


ఫార్మసిస్ట్ డ్యూటీ చేయడం మర్చిపోయారా?
నిజామాబాద్ సర్కార్ దావఖనలో పేదలకు అందని మందులు
సమయపాలన పాటించని అధికారులు
జనంవెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు వైద్యం సంగతి అటు ఉంచితే, మందులు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. రోగుల పట్ల ఏమాత్రం శ్రద్ద వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతినెల పేషెంట్ కు ఇవ్వాల్సిన లేవిప్రిల్, కారబోమాజైపాన్ టాబ్లెట్స్, కొరత ఉంది అనే కుంటి సాకుతో ఫార్మసిస్ట్ అక్కడికి వచ్చే సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతను సమయపాలన పాటించడం లేదని, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవ్వరికీ తెలియదని, హాజరు పట్టికలో మాత్రం హాజరు ఫుల్లుగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన జీజీహెచ్ అధికారులు చోద్యం చూడటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇండెంట్ ప్రకారం మందులు స్టాక్ ఉన్న, లేవని చెప్పి అక్కడికి వచ్చిన రోగులను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు. ఆసుపత్రి మెడికల్ షాపులో మరో దోపిడి కోణం ఆసుపత్రి అనుబంధ మెడికల్ షాపులోనే మందులు స్టాక్ లేదని, రోగులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అరకోరా మందులు ఇచ్చి మిగతా మందులు బయట మెడికల్ షాప్ లో కొనుక్కోండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఫార్మసిస్టును మారిస్తే గాని అక్కడ పరిస్థితి చక్కదిద్దె అవకాశం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పలో సైతం సర్కార్ మందులు దొరికిన విషయం వివిధమే. జిల్లా కలెక్టర్ అయినా ఏసీబీ అయినా అసలే భయం లేదని బహిరంగంగా చెబుతున్న ఫార్మసిస్ట్. జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన విషయం కానీ తనకేమీ తెలియదు అన్నట్టు వ్యవహరించడం విడ్డూరం. ఈ అధికారుల అవినీతి ముందు ఏ శాఖ అధికారులనా తలదించాల్సిందే.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








