Connect with us

ARTICLE'S

తీవ్రమవుతున్న డీఎస్సీ వాయిదా ఉద్యమం

janamvelugunews

Published

on

తీవ్రమవుతున్న డీఎస్సీ వాయిదా ఉద్యమం

జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- తెలంగాణలో డీఎస్సీ వాయిదా ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతోపాటు, అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేస్తున్నారు. చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒకవైపు అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలోనే ప్రభుత్వం డీఎస్పీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు ఉంటాయని, జూలై 11 నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దీంతో అభ్యర్థులు అర్ధరాత్రి కూడా పోరాటం కొనసాగించారు.తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాన విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ డీఎస్సీ. ఫిబ్రవరిలో రేవంత్‌ సర్కార్‌ 11,062 చీటర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కేవలం 5,089 పోస్టులతో సెప్టెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫకేషన్‌ రద్దు చేసి, దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. డీఎస్సీ ఉద్యోగాలు పెరగడంతో డీఎస్సీ పరీక్ష కంటే ముందు టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్‌ సర్కార్‌ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది జూన్‌లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది.ఇక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రేవంత్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవంగా డీఎస్సీ మొదటి నోటిఫికేషన్‌ గత సెప్టెంబర్‌లో వచ్చింది. దానిని పరిగణనలోకి తీసుకుంటే.. నోటిఫికేషన్‌ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు పది నెలలుగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూన్‌లో కొత్తగా టెట్‌ రాసిన కొంతమంది కోసం డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరండం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రేవంత్‌ సర్కార్‌ ప్రస్తుతం డీఎస్సీ నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్లతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చని భావిస్తోంది. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కానీ అభ్యర్థుల మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్‌లో భర్తీ చేయాలని, ఆమేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు.ఇక డీఎస్సీ ఉద్యమం వాయిదా వెనుక బీఆర్‌ఎస్‌ నేతలు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే రేవంత్‌ సర్కార్‌ ఫిబ్రవరిలో అదనపు పోస్టులు జోడించిందని. గత నోటిఫికేషన్‌ ప్రకారం.. నవంబర్‌లోనే పరీక్షలు నిర్వహించాలని, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అయినా తెరవెనుక బీఆర్‌ఎస్‌ ఉండి ఉద్యమాన్ని నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. పది నెలలుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నవారు కూడా తాజా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకున్నామని, దాదాపు ఏడాదిగా ప్రిపరేషన్‌లో ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా ఈ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే.. ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నా.. రేవంత్‌ సర్కార్‌ కూడా ఇప్పటికే డీఎస్సీ నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading