Connect with us

ARTICLE'S

బీజేపీ బ్యాక్ స్టెప్ ఎందుకు

janamvelugunews

Published

on

బీజేపీ బ్యాక్ స్టెప్ ఎందుకు

జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్‌లో 8 స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది. అయితే, అందుకు అనుగుణంగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటోంది. కానీ, బీజేపీలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటివరకు చేరింది లేదు. భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరుతారా.. అనేది కూడా సస్పెన్స్‌గా మారింది. దీంతో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా.. లేనట్టా? అనే ప్రశ్నలు శ్రేణుల్లో ఉత్పన్నమవుతున్నాయి.ఃవాస్తవానికి ఏ పార్టీలో లేనివిధంగా కేవలం చేరికలకే ప్రత్యేకంగా కమిటీ వేసిన పార్టీ బీజేపీ. ఈ బాధ్యతలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు అధిష్టానం అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించారు. అయితే, అప్పుడు పార్టీలో పలువురు చేరినా.. ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ దక్కలేదు. ఒకానొక సమయంలో కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు. అసలు చేర్చుకునేందుకు కూడా ఒక కమిటీ ఉంటుందా? అని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట దూసుకుపోతుంటే బీజేపీలో మాత్రం ఎలాంటి జాయినింగ్స్ లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సమానంగా సీట్లు సాధించిన కమలం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదెలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలంటే కింది స్థాయిలో కేడర్‌ను పెంచుకోవాల్సి ఉంది. కానీ, అందుకు అనుగుణంగా కమలం పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కమలం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించింది. కానీ, ఎన్ని కమిటీలు పూర్తయ్యాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమకు టచ్‌లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బాంబు పేల్చారు.అయితే, వారిని రాజీనామా చేయాలని కోరడంతో వారంతా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అయితే, వారంతా బీజేపీలో చేరతారా..లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే గ్రౌండ్ లెవల్లో నేతల చేరిక తప్పనిసరి. బడా స్థాయి నేతలు చేరకపోయినా.. కార్యకర్తలు, శ్రేణులను చేర్చుకున్నా స్థానిక సంస్థలకు పనికొస్తుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. కానీ, అందుకు అనుగుణంగా పార్టీ చర్యలు చేపట్టడం లేదని, చేరికల కమిటీ కూడా దృష్టి కేంద్రీ కరించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుందనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading