ARTICLE'S
మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి


మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి…
జనంవెలుగు, హైదరాబాద్, జూలై 10:- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్.. మళ్లీ సెంటిమెంట్ రగిలించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలతో ఏర్పడ్డ గ్యాప్ ను ఫిల్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. జాతీయ రాజకీయాలంటూ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీ పీఛేముడ్ అననుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పేరిట ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఓటమి.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు చెందిన శ్రీగణేశ్ గెలుపుతో.. బీఆర్ఎస్ బలం కాస్తా.. 38కి పడిపోయింది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం 15 చోట్ల మూడోస్థానానికి పడిపోవడం.. చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో కారు పార్టీ ఉక్కిరి బిక్కిరయ్యింది. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా హస్తం పార్టీలో చేరారు. వరుస వలసలు గులాబీ అధినేతకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇవాళ తనతో సమావేశానికి హాజరైన వారు తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుండడాన్ని గులాబీ బాస్ జీర్ణించుకోలేక పోతున్నారట. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కలిసొచ్చిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా ప్రజలతో గ్యాప్ ఏర్పడిందని పార్టీ నాయకత్వం భావిస్తున్నదని సమాచారం. ఇవాళ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాము చేసిన అభవృద్ది కన్నా సెంటిమెంటే విజయతీరాలకు నడిపిస్తుందని గులాబీబాస్ గట్టిగా నమ్ముతున్నారని సమాచారం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడం ప్రజలు పార్టీని ఓన్ చేసుకుంటారని కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. విభజన అంశాలను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తెరమీదకు తెచ్చి పార్టీని ప్రజల్లో ఉంచేందుకు టీఆర్ఎస్ గా మార్చడమే ఏకైక పరిష్కారమని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










