Crime
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త


సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, నందిపేట ఎస్సై రాహుల్
సైబర్ నేరస్తులతో పొంచి ఉన్న ప్రమాదం
జనంవెలుగు, నందిపేట్:- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఆయిన సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి సైబర్ నేరస్తులు అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం పొంచి ఉందని నందిపేట ఎస్సై రాహుల్ రైతులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొందరు సైబర్ నేరస్తులు ఏదో బ్యాంకు పేరిట, వాట్సప్ ప్రొఫైల్ బ్యాంక్ పేరు, బ్యాంకు లోగో తో వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. దీనిని మనం యాక్సెప్ట్ చేస్తే మన యాప్ వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్లి పోతుంది. అంతేకాకుండా మన కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళుతుంది. దీని ద్వారా సైబర్ నేరస్తులు మన గూగుల్ పే, ఫోన్ పే మరియు యూపీఐ ద్వారా డబ్బులు దోచేస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఏదైనా ఏపీకే ఫైల్స్ వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. వాట్స్అప్ పని చేయకుంటే వెంటనే రీ ఇన్స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్లో రిపోర్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా నేరానికి గురైతే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 కి కాల్ చేయండి. www.cybercrime.gov.in రిపోర్ట్ చేయాలని నందిపేట ఎస్సై తెలిపారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








