Connect with us

Crime

మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్

janamvelugunews

Published

on

మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్

విధుల్లో చేరాలని వైద్యులకు సుప్రీంకోర్టు రిక్వస్ట్ 

జనంవెలుగు, న్యూఢిల్లీ, ఆగస్టు 20:- కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య కేసుపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సూమోటోగా తీసుకున్న కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పని ప్రదేశాల్లోనే భద్రత లేకపోయే వారికి సమానత్వం ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అత్యాచారం కేసును హైకోర్టు విచారిస్తోందని తెలుసు కానీ ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సూమోటోగా తీసుకొని విచారిస్తున్నాం అని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా ఆలస్యంగా దాఖలయ్యింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో హత్య ప్రస్తావన ఉందా?. కేసును ఆత్మహత్యగా చెబుతున్నప్పుడు ప్రిన్సిపాల్ ఏమి చేస్తున్నారనేది అతిపెద్ద ప్రశ్న” అని చీఫ్ జస్టిస్ అడిగారు. దీనిపై విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ తన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టు ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు స్థితిని కూడా తెలియజేయాలని సూచించింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో యువ వైద్యుల దుస్థితి గురించి మాట్లాడారు. వాళ్ల పరిస్థితి ఏం బాగాలేదని అన్నారు. వారంతా ఇంటర్న్‌లు, రెసిడెంట్ డాక్టర్లు అన్నింటికంటే ముఖ్యంగా మహిళా డాక్టర్లు అని తెలుసున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. యువ వైద్యుల్లో చాలా మంది 36 గంటల పాటు పని చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడ కూడా సరైన వసతులు భద్రత లేదనేది సమాచారం. సురక్షితమైన పని పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం జాతీయ ప్రోటోకాల్‌ డెవలప్‌ చేయాల్సి ఉంది. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా వారు ఉద్యోగాలకు వెళ్లలేని దుస్థితి ఉదంటే మనం వారి  సమానత్వాన్ని నిరాకరిస్తున్నామని అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు చీఫ్ జస్టిస్. వీటన్నింటిపై నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి చూస్తున్నాం. సీనియర్ మరియు జూనియర్ వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధివిధానాలను ఈ టాస్క్‌ఫోర్స్ సూచిస్తుంది. అన్నారు. ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమాలు ఉన్నా.. అతడిని వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇక పలు మీడియా సంస్థల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫొటో, పేరును ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించింది. అలాగే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపలపై కూడా ధర్మాసం పలు కీలక ప్రశ్నలను సంధించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యంగ్‌ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని కోర్టు వెల్లడించింది. ఇందుకోసం వెంటే ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ల విధుల బహిష్కరణతో చాలా మంది రోగులు ఇబ్బందిపడుతున్నారని, తక్షణమే తమ నిరసనలు విరమించాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది.  అనంతరం ఈ విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
విధుల్లో చేరాలని వైద్యులకు సుప్రీంకోర్టు రిక్వస్ట్
దయచేసి విధులకు రండి… దేశ ప్రజల తరఫున వైద్యులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. “మీ భద్రతపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. రోగులు నష్టపోతున్నారు. కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సేవలు రద్దు చేయడం సరికాదు. మీరు విధుల్లోకి రండి” అని సీజేఐ విజ్ఞప్తి చేస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

janamvelugunews

Published

on

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Continue Reading