Connect with us

నిజామాబాద్

నిజామాబాద్ లో నిడ్రా వేయాల్సిందే: డా”కేశవులు

janamvelugunews

Published

on

నిజామాబాద్ లో నిడ్ర వేయాల్సిందే: డా”కేశవులు

నిజామాబాద్ జిల్లాలో చెరువులను కాపాడడానికి హైడ్రా వేయాల్సిందే !

అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బి కేశవులు డిమాండ్

జనంవెలుగు, నిజామాబాద్:- హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) విభాగాన్ని ప్రస్తుతానికి హెచ్ఎండీఏకే వర్తింపజేస్తున్నట్లుగానే, భారీగా కబ్జాలకు గురవుతున్న నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కులను కాపాడటానికి జిల్లాలో కూడ ” హైడ్రా ” తరహాలోనే “నిడ్రా” ను ఏర్పరచాలని తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల డాక్టర్ కేశవులు హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన “జిల్లాలో చేరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు – నిడ్రా ఏర్పాటు ” అంశంపై జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ఫూలాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్ గల్, డిచ్ పల్లి, నందిపేట్ ప్రాంతాల్లోని చెరువుల శిఖాలు, నిజాంసాగర్ కాల్వ కట్టల వద్ద కబ్జాలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినప్పటికి అధికారులు పట్టించుకోక పొవడం దారుణమని, నగర శివారులోని నిజామాబాద్- బోధన్ రహదారి పక్కనే రామర్తి చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు కాగా ప్రస్తుతం 15 ఎకరాలు కూడ లేదని, భీమ్ గల్ లో దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలోని రాథం చెరువు శిఖం ప్రాంతం 10 ఎకరాలకు మించి ఆక్రమణలను గురైందని, మొగిలి చెరువు, ధర్మారాయుడి కుంట ఆక్రమణలపై కూడ ఫిర్యాదులున్నాయని డాక్టర్ కేశవులు వివరించారు. అలాగే జిల్లాలో చెరువు శిఖాలు, కాల్వల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుంటే నీటిపారుదలశాఖ , మునిసిపల్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా లాంటి ఏజెన్సీలను నెలకొల్పి పర్యావరణను పరిరక్షించాలని, భవిష్యత్ తరాలకు అన్యాయం చేయవద్దని అవినీతికి పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని , వెంటనే జిల్లాలో ” నిడ్రా ” ను ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, త్వరలోనే అఖిలపక్ష కమిటీ ఏర్పరిచి తగు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయాలు చేసింది. పాల్గొన్న బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు గద్దె భూమన్న, సీనియర్ జర్నలిస్ట్ నేత బొబ్బిలి నర్సయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేశ్, వెంకట్రాములు, బి ఆర్ ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ నాయకులు మురళీ, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు దండి వెంకట్, రిటైర్డ్ ఎంప్లాయి యూనియన్ నాయకులు రామ్ మోహన్, రైతు సంఘం నాయకులు దేవ్ రామ్, పద్మశాలి నగర అధ్యక్షుడు దాబా నర్సయ్య, ప్రజా సంఘాల నాయకులు తూటికూర నర్సయ్య, జనసేన పార్టీ నేత సంతోష్, భారతీయ సంవిధావన్ నాయకులు శ్రీనివాస్, బహుజన కాంగ్రెస్ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్, రమేష్ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి, రుషి కుమార్, వనజ, విజయా, జర్నలిస్టు నాయకులు గంగదాస్, నర్సయ్యలు పాల్గొని ప్రసంగించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

పేదవానికి చదివే వజ్రాయుధం

janamvelugunews

Published

on

పేదవానికి చదివే వజ్రాయుధం

జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.

  8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,

   సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,

    నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,

    ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.

   అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.

  అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

  ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

janamvelugunews

Published

on

టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి

నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

janamvelugunews

Published

on

మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.

     ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,

      అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading