భక్తి
బతుకమ్మ సంబరాలు


బతుకమ్మ సంబరాలు
జనం వెలుగు, చిలిపిచేడ్:- తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారుచేసి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించారు. బుధవారం నుంచి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో నేడు చివరి రోజు కావడంతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు భావితరాలకు బతుకమ్మ విశేషాలు తెలిసే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగరాజు ప్రభాకర్, సుజాత కుమారి, శ్రీనివాస్, స్వప్న, నిర్మల, వసంత, భారతి, నజీమా పాల్గొన్నారు.
నిజామాబాద్
నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర


నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర
జూన్ 10 జనం వెలుగు: నందిపేట మండల కేంద్రంలో జులై 22వ తేదీన కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు.
ఈ సందర్భంగా, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు మాట్లాడుతూ పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర కనివిని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాలనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని,
కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథని ఆశీస్సులు పొందుతే,,, మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. అంత దూరం వెళ్ళని వారి కొరకు వారి వారి ప్రాంతాల ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అందులో భాగంగానే జులై 22న నందిపేట మండల కేంద్రం లోని వివేకానంద చౌరస్తా నుండి సాయంత్రం 6 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని, చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది, బస్టాండ్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సుభాష్ గల్లి సుభాష్ చంద్రబోస్,
గాంధీనగర్ గాంధీ చౌరస్తాలా విగ్రహాల మీదుగా నాగమంతెన ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందని, ఫంక్షన్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు జాతి మత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున రథయాత్రలో పాల్గొని ఎవరైతే
ఆ రథాన్ని లాగుతారో వారికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందుతాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
నేను అనునది తెలుసుకో…


గీత భక్త జనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి.
జనం వెలుగు బాల్కొండ:- నేను అనునది తెలుసుకోవడానికే గురువు ఆశ్రయించాల్సిన అవసరం ఉందని గీతా భక్తాజనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి అన్నాడు. మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యానంద స్వామి ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన 495వ సంచార సత్సంగంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు. తాను చేసిన సంపాదనలో 10 శాతం దానధర్మాలను చేయాలని, వాటి ద్వారా పూర్వ జన్మలో తెలిసో తెలి యకో చేసుకున్న పాపాలను కొంత మేరకు కడిగి వేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపాడు.
అన్ని జన్మలలో కెల్లా మానవ శ్రేష్టమై నదని ఈ మానవ జన్మ ద్వారానే జనన మరణ బంధనాలను త్రెంచు కొని, జనన, మరణ చక్రాల బంధనాల నుండి విముక్తి పొందే అవకాశం ఈ ఒక్క జన్మకే ఉందని ఆయన తెలిపాడు. రాగద్వేషాల వలన మనుజుడు అధోగతి పాలవుతాడని, ప్రతీ కారం తీర్చుకోవాలని తపనతో ఉన్న వ్యక్తి జీవితంలో ఏమి సాధించ లేక అన్ని కోల్పోయి దుర్భరమైన జీవితం గడపాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు.
త్యాగం వలన శాంతి లభిస్తుందని అప్పుడే అమర త్వాన్ని పొందుతామని, ఆత్మ సాక్షా త్కారం పొందేందుకే ఈ మానవ జన్మ ఆయన వివరించాడు. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెటుపల్లి, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్ తథితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విరజానంధ స్వామి, శ్రీ విశోఖ తీర్థ స్వామి, మాతా పరమేశ్వరి, మాతా సూరతా నందితా తదితరులు ప్రవచించారు.
నిజామాబాద్
బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్


బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
జనం వెలుగు, నిజామాబాద్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ పర్యవేక్షించారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు జరగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ బందోబస్తు ఏర్పాట్లలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితె, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








