Birthday
నేడు జె ఆర్ డి టాటా ఆయన వర్ధంతి


భారతదేశపు తొలి విమాన చోదకుడు, గొప్ప పారిశ్రామికవేత్త జె ఆర్ డి టాటా నేడు ఆయన వర్ధంతి
జనంవెలుగు, వెబ్డెస్క్:- భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు, ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడు, టాటా గ్రూప్ ఛైర్మన్ జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా, ఈయనకు 1992లో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యారిస్ లో జన్మించిన ఈయనను “జెహ్” లేక “జేఆర్డీ”గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది “ఎయిర్ ఇండియా”గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు. 34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ హోల్డింగ్ కంపెనీ లేక మాతృసంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి. జహంగీర్ రతన్‌జీ దాదాభాయి టాటా ఫ్రాన్స్ లోని ప్యారిస్‌లో రతన్‌జీ దాదాభాయి టాటాకు ఆయన ఫ్రెంచ్ సతీయణి అయిన సుజానె బ్రెయిర్‌కూ రెండో బిడ్డగా 1904 జూలై 29 లో జన్మించాడు. ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటా ఫ్రాన్స్‌లోని బీచ్‌బడ్డున ఉన్న హార్డెలోట్‌లో తన బాల్యాన్ని గడిపినప్పుడు, ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడింది. విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయీ బ్లెరియో నుండి ఆయన స్ఫూర్తి పొందాడు. 1929 లో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్ లైసెన్సు పొందాడు. తర్వాతి కాలంలో ఆయన భారత పౌర విమానయాన పితగా గుర్తింపు పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్‌ను 1932 లో స్ధాపించాడు. అదే తర్వాత 1946 లో ఎయిర్ ఇండియాగా మారింది. ఆయన తల్లి ఫ్రెంచ్ దేశానికి చెందినవారవటం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్‌లోనే గడిపాడు. అతను నేర్చుకున్న మొదటి భాష ఫ్రెంచ్. ఆయనకు ఎన్నో ఇష్టాలుండేవి. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనుకున్నాడు. వేగంగా వేళ్లే కార్లపై మోజు పడేవాడు, ఫ్రెంచ్ సైన్యంలో లా సఫిస్ (సిపాయిు) అనే రెజిమెంట్‌లో పనిచేశాడు. ముంబయిలోని కాథెడ్రల్, జాన్‌కానన్ పాఠశాల్లో చదువుకున్నాడు. 1925 లో టాటా స్టీల్ కంపెనీలో అప్పటి డైరెక్టర్ ఇన్‌ఛార్జి అయిన జాన్ పీటర్సన్ దగ్గర పనిచేయడానికి బొంబాయి హౌజ్‌కు వచ్చాడు. 1938 లో టాటా సన్స్‌కి చైర్మన్ అయిన సర్ నౌరోజి సక్లత్ వాలా చనిపోగానే 34 ఏళ్ల వయస్సున్న జె.ఆర్.డి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. చాలా దశాబ్దాల పాటు స్టీల్, ఇంజినీరింగ్ ఎల్లక్ట్రికల్ కంపెనీ వంటి ఎన్నో పరిశ్రమున్న టాటా గ్రూప్ సంస్ధను ఉన్నత ప్రమాణాలతో, ఏ రాజకీయవేత్తకూ లంచాలూ ముడుపులూ చెల్లించకుండా, నల్లబజారు మార్గం ఎంచుకోకుండా ఆయన వ్యాపారం నడిపించాడని కీర్తి పొందాడు. ఈ రోజుకూ విశ్వాసానికి మారుగా టాటా పేరు గడించాడు. 1939 లో దేశంలో మళ్లీ మళ్లీ ఏర్పడుతున్న కొరతను తీర్చడానికై స్వయం ఆధారితమైన మౌలిక కర్బనేతర రసాయన పరిశ్రమ టాటా కెమికల్స్‌ను భారతదేశం కోసం ప్రారంభించాడు. 1945 టాటా స్టీల్ వారు భారత రైల్వే శాఖలో లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీని స్ధాపించాడు. టెల్కోను తర్వాత టాటా మోటర్సుగా మార్పు చేసి భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆటోమోటివ్ మార్కెట్‌లో అత్యంతప్రధానమైనదిగాను తీర్చిదిద్దాడు. జెఆర్‌డి అధ్యక్షతన టాటా గ్రూప్ కంపెనీ 15 నుండి 100 కు అభివృద్ధి చెందాయి. 1932 లో టాటా విమానయాన సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆయనకు విమానాలపై ఉన్న ఆశ నెరవేరింది. మొట్టమొదటి భారత పౌర విమానం కరాచీలోని ద్రిగ్ రోడ్డు విమానక్షేత్రం నుండి 1932 అక్టోబరు 15 న భయలు దేరి టాటానే స్వయంగా ఒంటరిగా దాన్ని నియంత్రిస్తుండగా అహ్మదాబాద్‌కు, అక్కడి నుండి బాంబేకు చేరింది. టాటా ఏవియేషన్ సర్వీస్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వందకు వంద శాతం సమయపాలన పాటిస్తూ 10,000 రూపాయల లాభాన్ని పొందింది. 1953 లో ప్రభుత్వం విమానయాన వ్యాపారాన్ని జాతీయం చేయాని నిర్ణయించి ఆ పరిశ్రమకు అధ్యక్షుడుగా టాటాను ఆహ్వానించింది. దేశంలోని విమానయాన పరిశ్రమ అప్పుడు ఆధ్వాన్న స్ధితిలో ఉండింది. టాటా ఏవియేషన్ తర్వాత 1946
Birthday
|Nandipet నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….


నందిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి….
పల్లె పల్లె నా పండగలా 135 వ అంబేద్కర్ జయంతి…
నందిపేట్ ఏప్రిల్ 14 (జనం, వెలుగు): నందిపేట డొంకేశ్వర్ మండలాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఆయన ప్రతిమల వద్ద పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ముందుగా మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మండల కేంద్రం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా మొత్తం నీలిరంగుల జెండాలతో నింపేసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.
అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మహన్నదనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వివిధ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, బహుజన పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు. మండల ట్రస్మా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న మాట్లాడుతూ….. భీమ్రావు రాంజీ అంబేద్కర్ అనే పేరు, ఆయన ప్రతిమ లేని ప్రదేశం ఈ భారత దేశంలో ఎక్కడ లేదని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యుగ పురుషుడని కొనియాడారు.
సమానత్వం కొరకు అంటరాని తనం అనే విష సంస్కృతిని రూపుమాపేందుకు ఎంతో దూరదృష్టిగా రాజ్యాంగ చట్టం కల్పించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు అన్నారు. మండల కేంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ…. అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బహుజనులకు రక్షణ కరువయ్యేదని ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా సమాన హక్కులు ఉండేవి కావని, ఉక్కుపాదంతో అణిచివేసేవారని, ఈరోజు అనగారిన వర్గాల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే ఆ బిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు.
Birthday
బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక


బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ జన్మదిన వేడుక
జనం వెలుగు – చౌటకూర్:- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరఫ్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో మోహన్, విలేజ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ హనుమంతరావు, పర్మేశ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్ వెంకటేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నాయకులు సురేష్ సేవలను ప్రశంసించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఉత్సాహంగా జరుపుకున్నారు.
Birthday
PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి


PRTU నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి
జనంవెలుగు, నిజామాబాద్:- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని PRTU తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ, అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి సమానత్వాన్ని, స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేశ్వరరావు, గంగాధర్, బుచ్చన్న, జావీద్, శ్రీకాంత్, వినోద్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేశారు.








