Connect with us

ARTICLE'S

అధికారుల తీరుపై రేవంత్ అసంతృప్తి

janamvelugunews

Published

on

అధికారుల తీరుపై రేవంత్ అసంతృప్తి

జనంవెలుగు, వెబ్డెస్క్:- హైదరాబాద్, డిసెంబర్ 5:- రేవంత్‌ సర్కార్‌లోని కొందరు అధికారుల్లో ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అంటున్నారట. ప్రభుత్వం ఒకటి చెప్తే తామొకటి చేస్తున్నారట. ఇన్నాళ్లు చూస్తూ వదిలేసిన సీఎం వన్‌ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాక కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ప్రతి చిన్న విషయానికి తాను చెప్తే తప్ప పనిచేయడం లేదని పలువురు IASల పనితీరుపై గుర్రుగా ఉన్నారట సీఎం. ఇక చేసేదేం లేదు ప్రక్షాళన చేపడుదామని ఫిక్స్ అయిపోయారట. కీలక శాఖల్లో ఉన్నత హోదాల్లో ఉండి సరిగ్గా పనిచేయని అధికారులను మార్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాళ్ల పొజీషన్‌లో ఎవరినీ తీసుకోవాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పది రోజుల్లోనే సెక్రటేరియట్‌లోని కీలక శాఖల అధికారుల మార్పులు, చేర్పులు ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ అధికారికి ఏం పోస్ట్ దక్కబోతుంది.? ఇప్పుడున్న పోస్ట్ కంటే తక్కువ పోస్ట్‌కు వెళ్లేదెవరు.? ఏ అధికారి అందలమెక్కబోతున్నారు.? లూప్‌ లైన్‌లోకి వెళ్లేదెవరనే చర్చ సెక్రటేరియట్‌లో హట్ టాపిక్‌ మారిందిసమీక్షల్లో సీఎం ఓ డైరెక్షన్‌లో ఆర్డర్స్‌ ఇస్తే ఔట్ పుట్ మాత్రం ఇంకోలా వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వంపై ప్రజల్లో అనుకున్నంత సానుకూలత లేకపోవడానికి అధికారుల తీరే కారణమన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో పనిచేసినట్లు పలువురు అధికారులు సమర్ధవంతంగా పనిచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీఎంవోతో పాటు పలు శాఖల్లో ఉన్నతాధికారులు సమర్ధవంతంగా పనిచేయడం లేదట. ఏదైనా అడిగితే ఏదో కారణం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇదే సీఎం రేవంత్‌ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అందుకే అందరినీ మార్చేయండి. పనిచేసే వాళ్లనే కీలక శాఖల్లో పెట్టండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేశారట ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదట. కొత్తగా ఆదాయం పెంపు సంగతి పక్కన పెడితే రెగ్యులర్‌గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే పడిపోయిందట. అయినా అధికారుల్లో చలనం కనిపించడం లేదని ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం విషయంలో కూడా అధికారులు ప్రభుత్వాన్ని ముందే అలర్ట్ చేయలేదంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఉద్యమం చేసింది అదే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ విషయాలను ఉన్నతాధికారులెవరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదట. దీంతో చివరికి ఇథనాల్ ఫ్యాకరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వల్లే ప్రభుత్వం బద్నాం కావాల్సి వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇక లగచర్ల ఘటన కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. భూసేకరణ విషయంలో ముందుచూపుతో వ్యవహరించకుండా కలెక్టర్‌పై దాడి జరిగే వరకు వ్యవహారం వెళ్లింది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే సర్కార్ వెనకడుగు వేయాల్సి వచ్చేది కాదంటున్నారు. ఇదే క్రమంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం ఉందన్న అభిప్రాయంలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఒక ఘటన జరగ్గానే వెంటనే రియాక్ట్ అయి చర్యలు తీసుకుంటే ఇష్యూ పెద్దది అయ్యేది కాదని కానీ తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడం వల్లే పరిస్థితి చేయిదాటిపోయే వరకు వచ్చిందంటున్నారు. వీటన్నింటికీ ప్రభుత్వ నిర్ణయాలు ఓ కారణమైతే అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇక రెండో ఏడాదిలో అయినా అన్ని లక్ష్యాలను సాధించాలని ఫిక్స్ అయిపోయిందట రేవంత్ సర్కార్. అందుకే బాధ్యతాయుతంగా పనిచేయని అధికారులను ఉపేక్షించొద్దని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకునే బదులు మరో అధికారితో పనిచక్కబెట్టుకోవాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏ అధికారి బదిలీ అవుతారో..ఎవరికి లూప్‌ లైనే దిక్కవుతుందో చూడాలి మరి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading