ARTICLE'S
పొంచి ఉన్న పొరుగు ముప్పు


పొంచి ఉన్న పొరుగు ముప్పు
జనంవెలుగు, విశ్లేషణ:- బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తూర్పు పాకిస్తాన్ పేరును సార్థకం చేసుకోవాలని అనుకుంటుంది. యూనస్‌ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్మీ, గేమ్ అడుతున్నట్లు కనిపిస్తుంది. పాకిస్తానీయులు బంగ్లాదేశ్ వెళ్లడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఎత్తేశారు. బంగ్లా పాకిస్తాన్‌కు దగ్గరౌతుందనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. ఇండియా సహకారంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్, భారత్‌కే ముప్పుగా మారుతుందనే సందేహం వస్తోంది. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. భారత వ్యతిరేక పాకిస్తాన్‌కు మరింత దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయ్. విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత.. తర్వాత, భారత వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందడం చాలా అనుమానాలను రేపింది.బంగ్లాదేశ్ మిలటరీ కనుసన్నల్లో ఏర్పాటైన యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆజ్యం పోసింది. నోబుల్ శాంతి బహుమతి పొందిన ముహమ్మద్ యూనస్.. తన దేశాన్ని తీవ్రమైన అశాంతి దిశగా నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, యూనస్‌కి అధికారం వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ మరింత దగ్గరయ్యింది. పాకిస్తాన్ నాయకులతో పెరిగిన సంప్రదింపుల నుండీ పాక్‌తో చేసుకుంటున్న మిలటరీ ఒప్పందాల వరకూ చాలా అంశాల్లో పాక్-బంగ్లాదేశ్‌ల మధ్య బంధం బలపడుతూ ఉంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసింది. దీని తర్వాత, కొన్ని రోజుల క్రితమే, బంగ్లాదేశ్- భారత్ సరిహద్దుల్లో అత్యంత బలమైన వార్ డ్రోన్లను మొహరించింది. నిఘా కోసం మాత్రమే పెట్టామంటూ బొంకింది కూడా. ఇక, తాజాగా, మిలటరీ ఆదేశాలతో నడుస్తున్న యూనస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాకిస్తానీయులు బంగ్లాదేశ్ రావాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండేది. అలాంటిది, ఇప్పుడు ఆ క్లియరెన్స్ ఏమీ లేకుండానే వీసాలకు అనుమతి ఇచ్చేశారు పాక్ ఉగ్రవాదులు కూడా స్వేఛ్చగా బంగ్లాదేశ్‌లోకి అడుగుపెట్టడానికి ఎంట్రీ మరింత సులువుగా మార్చారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు ఆ దేశ స్థానిక మీడియా చెప్పింది. అయితే, ప్రభుత్వం నిర్ణయంపై అక్కడ నుండి ఎలాంటి కామెంట్లూ రాలేదు. గతంలో, తమ దేశంలోకి ఉగ్రవాదుల్ని రాకుండా అరికట్టడానికి చేసిన చట్టాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తేశారనే దానిపై ఎలాంటి విశ్లేషణా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.2019 నుండి.. పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ వీసా పొందాలంటే బంగ్లా సెక్యూరిటీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి “నో అబ్జెక్షన్” సర్టిఫికేట్ పొందాలి. ఆ సమయంలో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ, దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భద్రతా ప్రోటోకాల్స్‌లో భాగంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇకపై, సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో కరాచీ నుండి చిట్టగాంగ్‌కు నేరుగా కార్గో నౌకల తరలింపును బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.డిసెంబర్ 3న, బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత బేగం ఖలీదా జియాను తన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన రావడం చర్చకు దారి తీసింది. దేశ భద్రతకు అవసరమైన ఈ చర్యను మాఫీ చేయడంపై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినప్పటికీ.. ఆమే సలహా మేరకే ఇది జరిగినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ కనుసన్నల్లో గవర్నమెంట్ చీఫ్ సలహాదారుగా ఉన్న యూనస్ రబ్బర్ స్టాంప్‌లా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి.ప్రస్తుతం, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉగ్రవాదులు, ఛాందసవాదులను అనుమతించే “ఫాసిస్ట్ పాలన” నడుస్తుందని ఆరోపించారు. డిసెంబర్ 8న లండన్‌లో విదేశీ అవామీ లీగ్ మద్దతుదారుల సమావేశానికి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసిన జూలై-ఆగస్టు అల్లర్ల వెనక యూనస్ “మాస్టర్ మైండ్” ఉందని కూడా ఆమె ఆరోపించారు.ఆగస్టు 5 నుండి, మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల ప్రార్థనా స్థలాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయనీ.. యూనస్ పాలనలో జమాత్, ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కాల్పులు, హత్యలకు పాల్పిడిన ఉగ్రవాదులు, నేరస్థులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తోందని హసీనా ఆరోపించారు. హసీనా విడుదల చేసిన 37 నిమిషాల ఆడియో రికార్డింగ్‌ను బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లీగ్, బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు.అయితే, ఈ కీలక పరిణామల మధ్య తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబర్ 9న ఢాకా పర్యటించారు. అక్కడ, యూనస్‌తో సమావేశమైన మిస్రీ… బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళనను తెలియజేశారు. “సాంస్కృతిక, మత, దౌత్యపరమైన ఆస్తులపై దాడులు చేయడం విచారకరమని” మిస్రీ, యూనస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల, దేశ ద్రోహం కేసులో బంగ్లా పోలీసులు అరెస్ట్ చేసిన ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ కేసును వాదించే న్యాయవాదిని కూడా కేసును వాదించకుండా నిరోధించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.దేశం చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితిపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం చట్టపరమైన పాలనకు ప్రాధాన్యతనివ్వాలని, విధి విధానాలను గౌరవించాలని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరింది. బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. ఏది ఏమైనప్పటికీ… భారతదేశానికి వ్యతిరేకిగా.. చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లా ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఆదేశాలమేరకే మహ్మద్ యూనస్ ప్రభుత్వం నడుస్తుందనే వాదన గట్టిగా ఉంది. అందుకే, భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు దగ్గరౌతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










