Connect with us

నిజామాబాద్

ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి

janamvelugunews

Published

on

అనుమతుల మంజూరీలో పారదర్శకత పాటించాలి

భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

రేషన్ బియ్యం స్మగ్గ్లింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన నిఘా ఉంచాలి

వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

జనం వెలుగు న్యూస్, నిజామాబాద్ :- జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్ బియ్యం స్మగ్గ్లింగ్ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పై అంశాలపై పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల రోజుల క్రితం నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్ ఫోర్సుమెంట్ కమిటీ సమావేశం అనంతరం ఆయా ప్రాంతాలలో అక్రమ రవాణా, అక్రమ నిర్మాణాల విషయమై చేపట్టిన చర్యల గురించి రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా ఏ ఒక్క ఇసుక, మొరం వాహనం సైతం తిరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిర్ణీత రుసుము చెల్లించి సులభంగా ఇసుక, మొరం పొందేందుకు వీలుగా స్థానిక తహసీల్దార్లకు తాత్కాలికంగా అనుమతులు మంజూరు చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా అనుమతులను జారీ చేయాలని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటికే అనుమతులు పొంది అధికారికంగా జిల్లాలో కొనసాగుతున్న క్వారీలన్నీ తహసీల్దార్లు, ఎస్ హెచ్ ఓ ల పర్యవేక్షణలోనే కొనసాగాలని స్పష్టం చేశారు. ఉదయం 6 . 00 గంటల నుండి సాయంత్రం 6 . 00 గంటల వరకే క్వారీల నుండి ఇసుక, మొరం రవాణా జరగాలని, సెలవు రోజుల్లో తవ్వకాలు జరుగకుండా చూడాలన్నారు. అదేవిధంగా, పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను నిరోధించేందుకు మరింత గట్టిగా కృషి చేయాలని సూచించారు. పీడీఎస్ రైస్ ను రేషన్ కార్డుదారులు ఎవరైనా బ్లాక్ మార్కెట్ కు తరలించే వ్యక్తులకు విక్రయించినట్లు తేలితే అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రేషన్ కార్డును రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. రేషన్ బియ్యం అవసరం లేకపోతే తీసుకోకూడదని కార్డు హోల్డర్లకు హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.



కాగా, అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించకుండా ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని ఎన్ ఫోర్సుమెంట్ కమిటీలకు సూచించారు. టీఎస్-బిపాస్ ద్వారా అనుమతులు తీసుకోకుండా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయించాలని ఆదేశించారు. అలాగే అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే, వాటిని కూడా నిలిపివేయించి మున్సిపల్ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో తహసీల్దార్లు, ఎస్.హెచ్.ఓ లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. టీఎస్-బిపాస్ అనుమతులు పొంది, అందుకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినట్లయితే వాటిని సరి చేసుకునేందుకు వీలున్న సందర్భాల్లో నిర్మాణదారులకు రాతపూర్వక హామీతో నిర్ణీత సమయం వరకు గడువు ఇవ్వవచ్చని తెలిపారు. గడువులోపు అక్రమ నిర్మాణాలను సరిచేసుకోకపోతే వాటిని కూల్చివేయాల్సిందిగా ఎన్ ఫోర్సుమెంట్ కమిటీ సిఫార్సు చేయవచ్చని సూచించారు. నివాసయోగ్యమైన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు పొంది, వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనగానే పరిగణించబడుతుందని, ఈ తరహా నిర్మాణాల పైనా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని గడువు విధించారు. టీఎస్-బిపాస్ చట్టం పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కృషి చేయాలన్నారు. కాగా, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, భూముల పరిరక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్దీవోలు, తహసీల్దార్లు, ఎస్ ఎచ్ ఓలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading