నిజామాబాద్
దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ – అశ్విని ఆంజనేయులు


జనం వెలుగు న్యూస్:- భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని , కర్పురి టాకుర్ సామాజిక సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్విని ఆంజనేయులు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 జయంతి సందర్భంగా వనస్థలిపురం డివిజన్ వివేకానంద కాలనీలో, వివేకానంద విద్యవికస్ కేంద్రం ఆనాద ఆశ్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉన్న మన దేశాన్ని ఒక్కటి చేసి భారత దేశ అస్థిత్వాన్ని కాపాడిన మహనీయుడు సర్దార్ పటేల్ అని, ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఉక్కు మనిషిగా పేరుగాంచారని తెలిపారు, వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ దేశం యొక్క స్థితి ఇంకోలా వుండేదన్నారు. యువత ఈ దేశం యొక్క ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలని, సమాజం పట్ల, ఈ దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సర్దార్ పటేల్ వల్లనే తెలంగాణ కు స్వాతంత్ర్యo లభించిందని, నైజాం నుంచి తెలంగాణ ను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయించింది సర్దార్ పటేల్ అని గుర్తు చేశారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న విద్యార్థులకు ఉచిత హేర్ కట్టింగ్ చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి మహెంద్రనాత్, విద్యాలయం విద్యార్థులు, యువతి యువకులు , వివేకానంద కేంద్ర నిర్వుకులు, బాబురావు, వందనారానీ, వాలంటీర్లు , తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.
నిజామాబాద్
ఖిల్లా రామాలయానికి రోప్ వే.


ఖిల్లా రామాలయానికి రోప్ వే.
తొందర్లో డీపీఆర్ సిద్ధం..
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..
అర్బన్ ఎం ఎల్ ఎ ధన్ పాల్
జనంవెలుగు నిజామాబాద్ : – ఎంతో ఘన చరిత్ర కలిగిన ఇందూరు ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం ఖిల్లా రామాలయం అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులు జైలు శిక్ష అనుభవిస్తూ “నా తెలంగాణ కోటి రతనాల వీణ ” అని రాసిన గొప్ప చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు కావడం సంతోషకరమన్నారు.
పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్ల నిధులతో రోప్ వే నిర్మాణం కానుందని, ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో పాలించిన పాలకులు రామాలయ అభివృద్ధిని మరిచారన్నారు. మోదీ ప్రభుత్వం చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి వహిస్తుందని తెలిపారు.
ఇందులో భాగంగానే పర్వతమాల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధి కొరకు గతంలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో రోప్ వే మంజూరైనట్లు స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి నితిన్ ఘట్కరితోపాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖిల్లా రామాలయ అభివృద్ధి పై అనేక సార్లు లేఖలు అందజేయడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులను, రోప్ వే కంపెనీ ప్రతినిధులను పంపడం సంతోషకరమన్నారు.
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులపై కూడా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాని నియోజకవర్గం ఇందూరు
ఒకటేనని చెప్పారు. సమస్యను మంత్రి పొంగిలేటి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటీవల అర్బన్ లోని సౌత్ మండల అర్హులకు ఇళ్లను కేటాయించాలని గుర్తు చేశారు. అలాగే స్థలం లేని వారికి హైదరాబాద్ మాదిరిగా టవర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు.
ప్రధానంగా స్పెషల్ ఫండ్ కోసం ప్రభుత్వానికి అనేకసార్లు లీగల్ రాసిన స్పందించడం లేదన్నారు. చివరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు.
స్పెషల్ ఫండ్ కేటాయిస్తే నియోజకవర్గ అభివృద్ధి సులువుగా అవుతుందని తెలిపారు. ఇందూరులో కాషాయ జెండా గెలుపును ఓర్చుకోలేక నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. అవసరపు మాటలు మాట్లాడటమే తప్ప అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ఆలోచించడం లేదన్నారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, మఠం పవన్, రాము, విజయ మల్లేష్ యాదవ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, యువ మోర్చ అధ్యక్షుడు వంశీ, యువ మోర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్, ఎస్సీ మోర్చ పురుషోత్తం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి


పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి
కన్నుల పండుగగా నిజామాబాద్ జిల్లా పోలీసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,
జనం వెలుగు నిజామాబాద్ :- శనివారం నిజామాబాదు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసు సిబ్బంది , పోలీస్ కార్యాలయం సిబ్బంది , రేంజ్ కార్యాలయం సిబ్బంది , హోమ్ గార్డ్స్ సిబ్బంది మరియు అలైడ్ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులతో, పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
ముందుగా దుర్గామాత పూజాకార్యక్రమం, అనంతరం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు.
తెలంగాణ సoస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలియజేశారు.
జిల్లా ప్రజలకు బతుకమ్మ , విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
బతుకమ్మలను ఒక విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ, ఐక్యత , సోదరభావం , ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎ.సి.పి ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ , సిఐలు , రిజర్వ్ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.








