Crime
పోగొట్టుకున్న డబ్బు తిరిగి అప్పగింత


పోగొట్టుకున్న డబ్బు తిరిగి అప్పగింత
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదర్శంగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. లక్కంపల్లి గ్రామానికి చెందిన షాపురం సాయమ్మ అనే వృద్ధురాలు దత్తపూర్ గ్రామంలో తన కుమార్తె దగ్గర నుంచి రూ. 20,000 తీసుకుని తిరుగు ప్రయాణంలో బస్సు దిగే సమయంలో బస్తాలో నుంచి డబ్బులు ప్రమాదవశాత్తూ పడిపోయాయి. బస్సు దిగి అర్థం కాక నడుచుకుంటూ బస్టాండ్‌లో కూర్చున్న సాయమ్మకి తన డబ్బులు పోయిన విషయం తెలియక కలవరపడుతోంది. అదే సమయంలో మాయపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్నక్క అనే మహిళ అక్కడకు వచ్చి రోడ్డుపై పడివున్న డబ్బులు గమనించి చాకచక్యంగా వాటిని చేర్చుకుని సమీపంలోని ఆర్టీసీ కంట్రోలర్ హన్మాదాస్‌కు అప్పగించింది. కాగా, అక్కడే ఉన్న ఇంకొక మహిళ ఆ డబ్బులు నావని తప్పుడు సమాచారం చెప్పేందుకు యత్నించింది. అయితే చిన్నక్క అందుకు అంగీకరించకుండా నిజాయితీగా వ్యవహరించడంతో గొప్ప ఉదాహరణ నిలిచింది. ఆర్టీసీ కంట్రోలర్ హన్మాదాస్ వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. స్పందించిన నందిపేట్ పోలీసులు బస్టాండ్ వద్ద ప్రయాణికులను అడిగి విచారణ నిర్వహించారు. చివరికి బాధితురాలు సాయమ్మే అని గుర్తించి ఆమె కుమార్తెను సంప్రదించి, ధృవీకరణ అనంతరం రూ. 20,000 నగదును ఆమెకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు గొల్ల చిన్నక్క నిజాయితీని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. నిష్కల్మషంగా వ్యవహరించిన ఆర్టీసీ అధికారులు, పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన మానవీయ విలువలపై నమ్మకాన్ని మరింత పెంచింది.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








