మెదక్
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్


పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్
జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరఫ్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అప్పుడే పుట్టిన శిశువుల నుండి ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో రెండు చుక్కలు వేయడం ఎంతో అవసరం. ఇది వారి ఆరోగ్య భవిష్యత్తుకు బలమైన పునాది” అని తెలిపారు. పోలియో లేని గ్రామంగా సరఫ్‌పల్లిని తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు సమీప పోలియో టీకా కేంద్రాలకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోవర్ధన్ పిలుపునిచ్చారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మెదక్
MGNREGS| ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ


చిట్కుల్‌లో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ
జనం వెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను గ్రామస్తులకు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ బాగువాన్ రెడ్డి, టిసీ సురేష్, మండల కిసాన్‌సాల్ అధ్యక్షులు విట్టల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ భూమయ్య, మాజీ ఎంపీటీసీ సుభాష్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు, కార్యదర్శి తిరుపతి, మైనారిటీ సీనియర్ నాయకులు ఎండి అఖిల్, ఇంతియాజ్, బాగయ్య తదితరులు పాల్గొన్నారు.
మెదక్
చౌటకూర్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి వేడుకలు


చౌటకూర్‌లో భక్తిశ్రద్ధలతో గణేశ నవరాత్రి వేడుకలు
జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరాఫ్‌పల్లి గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న గణపతి ప్రతిష్ఠాపన సంప్రదాయాన్ని ఈసారి కూడా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి, హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి గణేశ నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు. మంగళవారం గ్రామ వేంకటేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గణేశుడి ఆశీస్సులు పొందారు.
మెదక్
కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పడకలు లేక అవస్థలు పడుతున్న రోగులు


కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పడకలు లేక అవస్థలు పడుతున్న రోగులు
జనం వెలుగు, కౌడిపల్లి:- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్య విషయం పట్ల రోగులకు ఎటువంటి ఆటంకం కలవకుండా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు సకాలంలో అందేలా సౌలతులు కల్పించింది. కాగా కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, (ఆయుష్మాన్ మందిర్)’లో పడగల కొరత ఏర్పడింది. ఆరోగ్య కేంద్రానికి రోజు సుమారుగా 20 మంది వైద్య సేవల కొరకు వస్తుంటారు. మంగళవారం 25 నుండి 30 మంది రాగా సరిపడా పడకలు లేక ఒక్కో బెడ్డుపై ఇద్దరిద్దరి రోగులకు వైద్య సేవలు అందించారు. దీంతో ఒకరి జబ్బులు మరొకరికి వచ్చే అవకాశం లేకపోలేదు. సరైన పడకలు లేక రోగులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఆరోగ్య కేంద్రంలో పడకలు కేవలం 6 మాత్రమే ఉండడంతో వైద్య సేవల కోసం వచ్చిన వారు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు ఒక్కొక్కరిని పరీక్షించి, మందు మాత్రలు ఇచ్చి పంపాల్సి వచ్చింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు మాత్రమే ఉండగా వాటితో సరిపెట్టుకుంటూ రోగులకు వైద్యులు సేవలందిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన వారికి సరైన సమయంలో వైద్య సేవలు అందడం లేదని, నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న 50 పడగల భవన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో, తక్షణ వైద్య సేవలు ఎప్పుడు అందునో అని రోగులు వేచి చూస్తున్నారు.