Connect with us

నిజామాబాద్

| Nizamabad ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్

janamvelugunews

Published

on

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్

జనం వెలుగు, నిజామాబాద్, జనవరి 13: అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో గల స్థలంతో పాటు, అంకాపూర్ శివారులోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని అన్నారు. ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన ఆయా నియోజకవర్గాలలో వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading

నిజామాబాద్

ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

janamvelugunews

Published

on

అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు

భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం

భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం 

 

జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.

  ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.

  మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.

   దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

   ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు

Continue Reading