Connect with us

నిజామాబాద్

| Nizamabad విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

janamvelugunews

Published

on

Views: 13452

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

 ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు

 మోడల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్

జనంవెలుగు, నిజామాబాద్, మార్చి 04 : ఇందల్వాయి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో రామ్ చరణ్ (15) అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు.

ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ ను, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్ ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇంచార్జి ఆకాష్ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయి, రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు. జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు.

నిజామాబాద్

అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు…

janamvelugunews

Published

on

Views: 127

అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు..

జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, భారీ ఊరేగింపు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన ఊరేగింపు భక్త జన సందోహల మధ్య, భక్తి గీతాలతో, నృత్యాలతో భక్తి పారవాశ్యం తో ఆర్ ఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు,అన్న ప్రసాదాలు నిర్వహించారు. నగరమంతా రామ నామ,, హనుమాన్ నామ స్మరణ తో మార్మోగింది. వినాయక్ నగర్ లోని సంకట మోచన హనుమాన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్చేస్ట్రా తో భక్తి పాటలు అందరిని మంత్ర ముగ్దులను చేసాయి.ఆలయ పురోహితుల మంత్రోచ్చారనలు, హారతి పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.శ్రీ నటరాజ నృత్య తరంగిని నాట్యాలయం ఆధ్వర్యంలో బంటు సుకన్య నేత్రుత్వంలో సహస్ర, నిహాన్వి, కె. ఆధ్య, టి. ఆద్య, పి. ఆధ్య, రూణి, ప్రేర్, తనిష్క, వేధిత చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఆలయ ఆవరణలో సంసృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలియ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు సాయంత్రం నృత్య తరగతులు తీసుకుంటున్నట్లు తెలిపారు.హనుమాన్ భారీ ర్యాలీ సందర్బంగా భక్తులు, వచ్చిన భక్తుల కోసం పులిహోర, బాదాం పాలు, జీరా అన్నం, రస్నా, శ్రీరామ రసం, లాంటివి అందించి భక్తుల మన్ననలు పొందారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.

Continue Reading

నిజామాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు

janamvelugunews

Published

on

Views: 24

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు

జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయని, కొత్త రేట్లు పాత ఛార్జిలతో పోల్చవద్దని, వినియోగదారులు ఈ విషయం లో మీ సేవ నిర్వాహకులకు సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. గతం లో కంటే ప్రస్తుతం మీ సేవల రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.వినియోగదారులుపాత ఛార్జిలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్షుడు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు. మేము నిన్ననే దరఖాస్తు చేసుకున్నాం, ఇంత చార్జీలు లేకుండే మీరేంటి బాగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు లాంటి అపోహాలు, వాదనలకు పోకుండా తాజా చార్జీలు చెల్లించి మీ సేవ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఇన్నేళ్లుగా యూసర్ ఛార్జిల్లో పెంపు లేకుండా ఉన్న మీ సేవల ఛార్జిలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాలతరపున ధన్యవాదాలు తెలియ చేసారు. వినియోగ దారులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ సేవ సేవలను వినియోగించు కోవాలన్నారు.

Continue Reading

నిజామాబాద్

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం

janamvelugunews

Published

on

Views: 110

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం నిజామాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం

జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా జరిగిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.58 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10 వేల కోట్ల ఆదా జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే రూ.365.50 కోట్ల ఆదా నమోదైందని వివరించారు.

ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.

ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి డిపోలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ఆర్మూర్ డిపోలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, బాన్స్‌వాడ డిపోలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ డిపోలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి మమత, సంధ్యారాణి, సరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు ఆనంద్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజవ్వ తదితరులు పాల్గొన్నారు.

మహిళా కండక్టర్లు సరళ, నాగకుమారి, జ్యోతి మరియు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Continue Reading