నిజామాబాద్
|Nizamabad జనం వెలుగు దినపత్రిక ప్రజల ఆలోచనలకు అద్దం


జనం వెలుగు దినపత్రిక ప్రజల ఆలోచనలకు అద్దం
తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు
జనంవెలుగు, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:- సమాజంలో ప్రజా చైతన్యాన్ని వెలిగించే దీపంగా, ప్రజల గొంతుకగా నిలిచిన ‘జనం వెలుగు’ తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బి. కేశవులు నేడు నిజాంబాద్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత, మేధో చైతన్యం అనే మూడు స్థంభాలపై నిలిచిన ఈ క్యాలెండర్ కేవలం తేదీలు, పండుగల సమాహారం మాత్రమే కాదు, ప్రజల ఆలోచనలకు దిశ చూపించే ఒక విజన్ డాక్యుమెంట్‌గా రూపుదిద్దుకుంది. క్యాలెండర్ ఆవిష్కరణ ఒక సామాజిక సందేశం. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కేశవులు మాట్లాడుతూ, “పత్రిక అనేది వార్తల వ్యాపారం కాదు ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడే సామాజిక బాధ్యత” అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రశ్నించడం, అధికార వ్యవస్థలకు అద్దం పట్టడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం ఇవే నిజమైన మీడియా ధర్మాలని ఆయన పేర్కొన్నారు. ‘జనం వెలుగు’ క్యాలెండర్ ఈ విలువలనే ప్రతి నెల, ప్రతి రోజు గుర్తుచేసేలా రూపొందించబడిందని తెలిపారు. తెలంగాణ మేధావుల సంఘం – మేధో చైతన్యానికి కేంద్రం ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన తెలంగాణ మేధావుల సంఘం తెలంగాణలో మేధోచర్చలకు, ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సంస్థ. రాష్ట్ర చరిత్ర, భాష, సంస్కృతి, ప్రజా ఉద్యమాల నేపథ్యంతో ఏర్పడిన ఈ సంఘం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉందని మరోసారి ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. ‘జనం వెలుగు’ క్యాలెండర్ ప్రత్యేకతలు ఈ క్యాలెండర్‌లో ప్రతి నెల ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకొని రూపొందించడం విశేషం.
మీడియా బాధ్యతపై డాక్టర్ కేశవులు స్పష్టమైన మాటలు
మీడియా
ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. “నేటి కాలంలో వార్తలకంటే వేగమే ప్రధానం అయింది. కానీ వేగం కోసం నిజాన్ని త్యాగం చేయడం ప్రమాదకరం. ప్రజల విశ్వాసమే మీడియా యొక్క అసలైన మూలధనమని కొనియాడారు. సోషల్ మీడియా ప్రభావంతో వాస్తవాల కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని, దీనిని ఎదుర్కోవాలంటే సంప్రదాయ మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల మధ్యకు క్యాలెండర్
ప్రజల కోసమే ఈ క్యాలెండర్‌ను గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, కార్యాలయాల్లో విస్తృతంగా పంపిణీ చేయనున్నట్లు ‘జనం వెలుగు’ అధినేత సీతర్ల సురేష్ ప్రకటించారు. యువతలో ప్రశ్నించే ధోరణి పెంపొందించడం, సమాజంపై బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మరియు మహిళా హక్కుల వేదిక కన్వీనర్ డాక్టర్. బి .హర్షిణి , ప్రజా మీడియా అధినేత డి ఎల్ ఎన్ చారి. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ బి. హర్ష వర్ధన్ ఇతర రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మేధావులు, జర్నలిస్టులు మాట్లాడుతూ ఇలాంటి క్యాలెండర్‌లు కేవలం గోడలపై వేలాడే వస్తువులు కావని, ప్రజల ఆలోచనల్లో వేలాడే సందేశాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘జనం వెలుగు’ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు.
సామాజిక ఉద్యమంగా ‘జనం వెలుగు’ సాధారణంగా క్యాలెండర్ అనగానే పండుగలు, సెలవులు గుర్తుకు వస్తాయి. కానీ ‘జనం వెలుగు’ క్యాలెండర్ ప్రజా సమస్యలు, సామాజిక బాధ్యతలు గుర్తు చేసే ఒక ఉద్యమ పత్రంగా రూపాంతరం చెందిందని పలువురు వ్యాఖ్యానించారు. ఇది ఒక ప్రచురణ కాదు. ఇది ఒక ఆలోచనా ప్రక్రియ. భవిష్యత్ దిశ ఈ క్యాలెండర్ ఆవిష్కరణతో ‘జనం వెలుగు’ తన జర్నలిజాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పాన్ని ప్రకటించినట్లైంది. రాబోయే రోజుల్లో ప్రజా చర్చలు, సెమినార్లు, మేధో వేదికలు నిర్వహిస్తూ క్యాలెండర్‌లోని అంశాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా, ‘జనం వెలుగు’ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ—ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది ప్రజల ఆలోచనలకు వెలుగు నింపే ప్రయత్నం. డాక్టర్ బి. కేశవులు చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం మేధోచైతన్యం, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచింది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల గొంతుకగా నిలిచే మీడియా అవసరాన్ని మరోసారి ఈ కార్యక్రమం గుర్తు చేసింది.
నిజామాబాద్
టి జి ఎస్ ఆర్ టి సి నూతన రీజినల్ మేనేజర్ గా ఎస్ వి జి కె మూర్తి


టి జి ఎస్ ఆర్ టి సి నూతన రీజినల్ మేనేజర్ గా ఎస్ వి జి కె మూర్తి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన రీజినల్ మేనేజర్.
నిజామాబాద్ రీజియన్ నూతన రీజినల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్విజీకే మూర్తి కి, డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి కి డిప్యూటీ రీజినల్ మేనేజర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆరు డిపోల డిపో మేనేజర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు పాల్గొని నూతన రీజినల్ మేనేజర్ కుశుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నూతన రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో కొత్త బస్సు మార్గాల అవసరం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రజా రవాణాసౌకర్యాల విస్తరణ,ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, విద్యార్థులు,ఉద్యోగులు మరియు సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పన వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు మార్గాల ప్రతిపాదనలు, ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు సర్వీసుల నిర్వహణ, ఆర్టీసీ సేవలను మరింత ప్రజలకు చేరువ చేసే చర్యలపై రీజినల్ మేనేజర్ ఎస్విజీకే మూర్తి హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎంపీవోలు మరియు సంబంధిత శాఖల అధికారులుపాల్గొన్నారు.జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందని రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి తెలిపారు.
నిజామాబాద్
నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర


నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర
జూన్ 10 జనం వెలుగు: నందిపేట మండల కేంద్రంలో జులై 22వ తేదీన కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు.
ఈ సందర్భంగా, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు మాట్లాడుతూ పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర కనివిని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాలనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని,
కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథని ఆశీస్సులు పొందుతే,,, మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. అంత దూరం వెళ్ళని వారి కొరకు వారి వారి ప్రాంతాల ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అందులో భాగంగానే జులై 22న నందిపేట మండల కేంద్రం లోని వివేకానంద చౌరస్తా నుండి సాయంత్రం 6 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని, చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది, బస్టాండ్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సుభాష్ గల్లి సుభాష్ చంద్రబోస్,
గాంధీనగర్ గాంధీ చౌరస్తాలా విగ్రహాల మీదుగా నాగమంతెన ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందని, ఫంక్షన్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు జాతి మత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున రథయాత్రలో పాల్గొని ఎవరైతే
ఆ రథాన్ని లాగుతారో వారికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందుతాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
టీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎంకు ఘన వీడ్కోలు సన్మానం


టీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎంకు ఘన వీడ్కోలు సన్మానం
జనం వెలుగు, నిజామాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోత్స్న బదిలీపై నల్గొండకు వెళ్తున్న సందర్భంగా, డిప్యూటీ రీజియన్ మేనేజర్ మధుసూదన్ మెదక్ రీజియన్ మేనేజర్‌గా పదోన్నతితో బదిలీ అయిన సందర్భంగా నిజామాబాద్ రీజియన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డిపో మేనేజర్లు ఆనంద్, సాయన్న, దినేష్, సూపర్వైజర్లు, మెకానికల్ ఫోర్‌మెన్లు, రీజియన్ పర్సనల్ ఆఫీసర్ పద్మజ, రీజియన్ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా సన్మానించారు.
సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన టి. జ్యోత్స్న, నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులందరూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే మెదక్ రీజియన్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మధుసూదన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
డిపో-1 మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ, బస్సు షెడ్యూళ్లు పెరిగినప్పటికీ సమర్థవంతమైన నిర్వహణతో డిపోను ముందంజలో నిలపడానికి అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ డిపో-2ను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపిన డిపో మేనేజర్ సాయన్నను ప్రత్యేకంగా అభినందించారు.
సన్మానానికి స్పందించిన అధికారులు తమ సేవా కాలంలో సహకరించిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, పీఆర్‌ఓ రాజేందర్, ఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది ఆనంద్, మహేష్, సత్యనారాయణ, డిపో-1 సూపరింటెండెంట్ శ్రీలత, మెకానికల్ ఫోర్‌మన్ వసుందర, సీఐ జనాబాయి, బస్‌స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.














