Connect with us

నిజామాబాద్

| Balkond sunil reddy నేను ఏ తప్పు చేయలేదనే కోర్టు కేసును కొట్టివేసింది.

janamvelugunews

Published

on

నేను ఏ తప్పు చేయలేదనే కోర్టు కేసును కొట్టివేసింది.

నేను కర్మ సిద్ధాంతాన్ని,ధర్మాన్ని నమ్ముతా..

బాల్కొండ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి

జనం వెలుగు బాల్కొండ:- కొంత మంది జిఎస్టి అధికారులు చూయిం చిన అత్యుత్సాహం వలననే కోర్టుకు తీసుకెళ్ళడం వలన, కావాలని ఇబ్బందులు పెడుతున్నారని కోర్టు గ్రహించి తాను ఏ తప్పు చేయలేదని కోర్టు కేసును కొట్టివేసిందని బాల్కొండ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి అన్నాడు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ లోని ప్రజానిలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు.

నేను కర్మ సిద్ధాంతాన్ని ధర్మాన్ని నమ్ముతున్నందుకే భగవంతుడు నన్ను కాపాడాడని పూర్తిగా విశ్వసిస్తున్నానని ఆయన తెలిపాడు. వ్యక్తి గతంగా తనను, కాంగ్రెసు పార్టీని కావాలని మాజి మంత్రి ప్రశాంత్ రెడ్డి నా ప్రతీష్టతకు భంగం కలిగించేందుకు గాను టివి చానెళ్ళలో, బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాడని, కోర్టు తీర్పు ప్రశాంత్ రెడ్డికి చెంపపెట్టు అయ్యిందని ఆయన తెలిపాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ ట్రావెల్స్ ద్వారా 12 శాతం, మిగితా ఇతర రాష్ట్రాలలో 5 శాతం జిస్టీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల ద్వారా చెల్లించే వారమని, ఇతర రాష్ట్రాలలోను 12 శాతం జిస్టీ కట్టాలని ఒత్తిడి చేశాడని దాని వలన 28 కోట్ల రూపాయలను అదనంగా కట్టాలని తన సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ పై విచారణ చేపట్టి తనను కోర్టుకు తీసుకెళ్ళే సరికి ఒక వ్యక్తిని కావాలని ఇబ్బందులు పెడుతున్నారని కోర్టు గ్రహించి తనను అరెస్టు చేయవద్దని కోర్టు తీర్పు చెప్పిందని ఆయన తెలిపాడు.

బిఆర్ఎస్ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో 6000 పై చిలుకు రుపాయలతో సరాఫరా చేస్తే ఏనాడు లేనంతగా ప్రస్తుతం 3000 రుపాయలలోపే ప్రజలకు సరాఫరా చేస్తుంటే ఇసుక మాఫియా అని ప్రశాంత్ రెడ్డి చులకన చేస్తున్నాడని, నీకు దమ్ము ధైర్యం ఉంటే సంక్రాంతి లోపు ఏదైనా తేదీ ఫిక్స్ చేసి చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరాడు. ఒకవేళ చర్చకు రాకుంటే బట్టాపూర్ క్రష్షర్ దొంగగా ప్రశాంత్ రెడ్డికి నామకరణం చేస్తామని ఆయన తెలిపాడు. నియోజకవర్గంలోని బట్టాపూర్ క్రష్షర్ ద్వారా 10 వేల క్యూబిక్ మీటర్లకు అనుమ తులు తీసుకుని 5 లక్షల క్యూబిక్ మీటర్ల త్రవ్వుకుని అటు ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసిన చరిత్ర ప్రశాంత్ రెడ్డి దని ఆయన దుయ్యబట్టాడు.

బట్టాపూర్ లో క్రష్షర్ అదనంగా త్రవ్వకాలను జరిపడంతో ప్రభుత్వానికి సుమారు 112 కోట్ల రూపాయల బకాయి ఉన్నాడని, అలాగే 52 లక్షల కరెంటు బిల్లులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపాడు. మేం అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదని వీటిపై విచారణ జరి పించాలని తాను ఎవరిమీద ఒత్తిడి తేలేదని, ప్రశాంత్ రెడ్డి దొంగ వేషాలు వేస్తున్నాడని ఆయన విమర్శించాడు.

నిజామాబాద్

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

Thammali Pandu

Published

on

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే 

జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.

Continue Reading

నిజామాబాద్

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

Thammali Pandu

Published

on

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ 

 దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం 

 పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు 

జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్  చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading