Crime
| Nandipet Crime నందిపేటలో కిలాడీ లేడీ అరెస్టు


నందిపేటలో కిలాడీ లేడీ అరెస్టు


జనంవెలుగు, నందిపేట్ మూన్ డిజైన్ శేఖర్ :- నందిపేట మండల కేంద్రంలో ఓ ఘరానా లేడి ఆడిన ముసుగు నాటకం కు కళ్లెం వేసి ఆ కిలాడీలేడని మరో ఇద్దరిని కటకటాల వెనక్కి పంపారు నందిపేట పోలీసులు. గత 4 తేదీ నా నాపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారని మండల కేంద్ర శ్రీరామ్నగర్ లో నివాసం ఉంటున్న పిప్పెర అంకిత(34)
పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో మళ్లీ 22వ తేదీ రోజున అదే మహిళ నా ఇంటిలోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నన్ను బంధించి నా చేతులపై, తొడల పైన వాతలు పెట్టారని, తీవ్రంగా కొట్టారని రెండోసారి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మిస్టరీని చేదించేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
అంకిత ఇంటి దగ్గరలోని సీసీ కెమెరాలను, అంకిత సెల్ ఫోన్ డాటాను, అంకితతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించారు. అయితే విచారణ లొ అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసం నాటకమాడి నాపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన ఆ కిలాడి లేడి అంకితే ఈ నాటకానికి సూత్రధారి. అంకిత, నవిన్ లు ఆడిన ముసుగు, వాతల నాటకాన్ని రెండు రోజుల్లోనే బట్ట బయలు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే సీఐ జాన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అంకిత జిల్లా కేంద్ర ఓ షాపింగ్ మాల్ లో పనిచేసేదని మండల కేంద్రానికి చెందిన సింగారం నవీన్ అనే యువకుడితో సంబంధం పెట్టుకొని మండల కేంద్రంలో గల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాటును దక్కించుకోవాలని పన్నాగం పన్నారు.
దాని కొరకు ఆ వెంచర్ ఆఫీస్ లో పనిచేసే ప్రతాప్ రెడ్డి వద్దకు అంకిత నవీన్లు వెళ్లి సంప్రదించారు. అయితే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ప్రతాప్ రెడ్డి ప్లేస్ లో ఇదివరకు అంబటి శ్రీనివాస్ అనే అతను పని చేసేవాడని. మేనేజ్మెంట్ అతని పై లావాదేవీల ఫిర్యాదులు రావడంతో అతన్ని తీసేయడం జరిగింది, దాంతో అంబటి శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి పై కక్ష సాధింపుగా ఉన్నాడు. ఇదే తరుణంలో అంకిత నవీన్లు ప్రతాప్ రెడ్డి వద్దకు వచ్చినది తెలుసుకొని అంకిత నవీన్ లను పరిచయం చేసుకొని వీరిద్దరితో ప్రతాప్ రెడ్డిపై కక్షతీసుకునేందుకు ప్రతాప్ రెడ్డి ని బెదిరిస్తే లాభం చేకూరుతుందని నమ్మ పలికాడు. దీంతో ప్లాటు కొనేందుకు వెళితే ప్రతాప్ రెడ్డి నా పై అసభ్యంగా ప్రవర్తించాడని ప్రతాప్ రెడ్డి పై కేసు పెట్టింది అంకిత. పోలీసులు కేసు నమోదు చేసేసరికి ప్రతాపరెడ్డిని 30 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది అంకిత. ప్రతాప్ రెడ్డి ససేమిరా అనడంతో నాటకం నందిపేట మండల కేంద్రానికి చేరింది. నేను నందిపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నానని, పని నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి దగ్గర నాపై ఎవరో ముసుగు వేసి దాడి చేసే కొట్టారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే మళ్లీ 20 రోజుల వ్యవదిలోనే మళ్లీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడి నన్ను బంధించి నా చేతులపైన, తొడల పైన, వాతలు పెట్టి కొట్టారని ఫిర్యాదు చేసింది అంకిత. దీంతో ఎలాగైనా ఈ కేసును చేదించాలని రంగంలోకి దిగిన పోలీసులు అంకిత ఫోన్ కాల్ ఆధారంగా సింగరాయ నవీన్, అంబటి శ్రీనివాస్ లను విచారించగా ఈ ముగ్గురే అసలు నేరస్తులని, నాటకమంతా ఆడింది వీరేనని, నాటకాన్ని బట్ట బయలు చేశారు.ఈ కిలాడి లేడి డబ్బుల కోసం తన ప్రియుడు నవీన్ తో కలిసి సినిమా స్టోరీని తలపించే నటకాన్ని ఆడింది కానీ పోలీసులు ఈ కిలాడి లేడిని తమదైన శైలితో విచారించి కటకటాల వెనక్కి నెట్టారు.
డబ్బుకోసం ముసుగు నాటకమాడి, తప్పుడు ఫిర్యాదుతో వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని, ఇటువంటి ఘరానా మోసగాళ్లు, కిలాడి లేడీ లు వేసే పన్నాగాలకు ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్యామ్ రాజ్ హెచ్చరించారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




















