Connect with us

మెదక్

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

janamvelugunews

Published

on

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక

జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మెదక్

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

janamvelugunews

Published

on

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.

రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

మెదక్

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

janamvelugunews

Published

on

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్

జనంవెలుగు, చిలప్ చెడ్:-  మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.

రక్తదాత సుఖీభవ

Continue Reading

మెదక్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్

janamvelugunews

Published

on

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్

జనం వెలుగు, చౌటకూర్:- చౌటకూర్ మండలం సరఫ్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అప్పుడే పుట్టిన శిశువుల నుండి ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో రెండు చుక్కలు వేయడం ఎంతో అవసరం. ఇది వారి ఆరోగ్య భవిష్యత్తుకు బలమైన పునాది” అని తెలిపారు. పోలియో లేని గ్రామంగా సరఫ్‌పల్లిని తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు సమీప పోలియో టీకా కేంద్రాలకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోవర్ధన్ పిలుపునిచ్చారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Continue Reading