మెదక్
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి ఖాయం: బీజేపీ ఎంపీ అరవింద్


జనం వెలుగు, మెదక్:- రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. గురువారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్ లో బీజేపీ శక్తి కేంద్ర ఇంఛార్జీలు,బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేసినా, అంతరిక్షంలో తిరిగిన,కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 8 సం.కాలంలో డబుల్ బెడ్ రూం లు ఒక్క లక్షా 70 వేలు పూర్తయ్యాయని కేసీఆర్ చెపుతున్నప్పటికి కేవలం 23శాతమే పూర్తయ్యాయని తెలిపారు.ఢిల్లీ నుండి తెలంగాణ వరకు కల్వకుంట్ల ప్రభుత్వం దోచుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఇంఛార్జిగా ఉంటే అక్కడ ఓటమి తథ్యమన్నారు.రాష్ట్రంలో బీజేపీ పార్టీ నెంబర్ వన్ గా ఉందన్నారు.మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిజాం చక్కర పరిశ్రమ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కల్పన,రోడ్లన్నీ అద్దాలుగా మెరిసే విషయంలో పూర్తిగా వెనుకబడి పోయారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్ గుప్త, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి ఎక్కలదేవి మధుసూదన్, మహిళా మోర్చా నాయకురాలు బెండే వీణ,నాయకులు శ్రీపాల్,నియోజకవర్గ స్థాయిలోను ఇంఛార్జిలు,బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








