నిజామాబాద్
జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి


కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
జనం వెలుగు, నిజామాబాద్:- ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశమై అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని సీఈఓ దృష్టికి తెచ్చారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. అయితే, ఓటర్లకు కార్డులు అందాయా? లేదా? అన్నది క్షేత్ర స్థాయిలో బీ ఎల్ ఓ లచే నిర్ధారణ చేసుకోవాలని సీ ఈ ఓ వికాస్ రాజ్ సూచించారు. కొత్తగా చేపట్టిన ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల జాబితాను సైతం క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించాలని, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి జిల్లాలో 85 నుండి 90 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీ ఎల్ ఓ లు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. కాగా, జాతీయ ఓటరు దినోత్సవం గురించి విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ‘ మై భారత్ హూ’ గేయాలాపన అనంతరం ప్రతిజ్ఞ ఉంటుందని, ఆ పై ఓటరు కార్డుల పంపిణి, ఓటర్లకు సన్మానం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జెడ్పి సీ ఈ ఓ గోవింద్, ఆర్దీఓ లు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డీసీఓ సింహాచలం, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిజామాబాద్
ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి


ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.
















