మెదక్
సామాజిక సారథి తెలుగు దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత రెడ్డి..


జనం వెలుగు, మెదక్ ప్రతినిధి:- కౌడిపల్లిలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతా రెడ్డి, లు సామాజిక సారథి క్యాలెండర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు మధ్య పత్రికలు వారధిగా ఉంటాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, కౌడిపల్లి ఎంపీపీ రాజునాయక్, కౌడిపల్లి సర్పంచ్ చిలుముల వెంకటేశ్వర రెడ్డి, కౌడిపల్లి జెడ్పిటిసి కవిత అమర్ సింగ్, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అంపటి సంతోష్ కుమార్, నర్సాపూర్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, కౌడిపల్లి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, కౌడిపల్లి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామా గౌడ్, శివంపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, చిలప్పేడ్ మండలం వైస్ ఎంపీపీ విశ్వంబ రస్వామి, సోమక్కపేట్ సొసైటీ వైస్ చైర్మన్ రాoచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్య రెడ్డి, ఎంసి విఠల్, నాకు నాగ్సాన్ పల్లి సర్పంచ్ యెల్లం, చిలప్ చెడ్ మండలం కో ఆప్షన్ మెంబర్ షఫీయోద్దీన్, కౌడిపల్లి కోఆప్షన్ మెంబర్ హైమద్, కౌడిపల్లి బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ చంద్రం కృష్ణ గౌడ్, చిలప్ చెడ్ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ సారా సప్న కిషోర్ గౌడ్, నవీన్ రావ్, రిటైర్ టీచర్ పుండరీకం గౌడ్, సామాజిక సారధి మెదక్ బ్యూరో కృష్ణ గౌడ్, జనం వెలుగు మెదక్ జిల్లా ప్రతినిధి ఇంతియాజ్ మిర్జా, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








