మెదక్
పేదింటి ఆడ పిల్లలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం


జనం వెలుగు, చెలిపీఛెడ్ :- మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. శీలం పల్లి గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలానికి సంబంధించి 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం గంగారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అని మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మండల స్పెషల్ ఆఫీసర్ కౌడిపల్లి ఏడిఏ పద్మ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, సర్పంచ్ మమతా బాబు, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ పటేల్, ఎంసి విఠల్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, బిసి సెల్ మండల అధ్యక్షుడు పోచయ్య,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజేత (బిఎంఎస్ ఆయుర్వేదిక్), శ్రీధర్ రెడ్డి, ఏఎన్ఎంలు రేణుక, పారమ్మ, మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సుభాష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక


ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక
జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాషాయం జెండాను ఎగరవేసి దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. హిందూ సామ్రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత శివాజీ మహారాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కవెల్లి రాజు, శివాజీ యూత్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి, గొల్ల అంబయ్య, చాకలి కృష్ణ, పుట్టి బాలరాజ్, మోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది.
మెదక్
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్


అత్యవసర సమయంలో రక్తదానం చేసిన మీర్జా ఇంతియాజ్ బేగ్
జనంవెలుగు, చిలప్ చెడ్:- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్ బేగ్ మానవత్వానికి మారు పేరు అయ్యారు. సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీగ్నెస్ రాధా (వయసు 50)కు అత్యవసరంగా రక్తం అవసరం ఉందని సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మీర్జా ఇంతియాజ్ బేగ్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మహత్తరమైన సామాజిక సేవ అని తెలిపారు. ఇప్పటివరకు తాను 25 సార్లు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రక్తదానం చేయడమే కాకుండా, ప్రజలకు సేవ చేసే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన చేసిన ఈ సేవకు ఆసుపత్రి సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రక్తదాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పలువురు ప్రశంసించారు.
రక్తదాత సుఖీభవ








