మెదక్
మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం


మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేసిన చౌటకూరి గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్
మండలంలో సేవే లక్ష్యం గా ముందుకు సాగుతా – గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్
ప్రజా సేవలో ముందుకు సాగుతున్న గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్
జనం వెలుగు, చెలిపీఛెడ్ :- మండల కేంద్రంలో ని ప్రాధమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మండలంలోని ఉపాధ్యాయిని,ఉద్యోగినిలను PRTU సంఘం తరపున చౌటకూరి గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్ సహకారంతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చౌటకూరి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారని అన్నారు. అనంతరం చౌటకూరి గోవర్ధన్ రెడ్డి బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చౌటకూరి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యక్షుడు పీఆర్టీయూ నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెదక్
చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ


చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
జనం వెలుగు చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్ స్థానంలో ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.
చిలిపిచేడ్ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్ ప్రవీణ్‌కు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మెదక్
చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం


చిట్కుల్లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం
జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మెదక్
చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం


చిట్కుల్లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం
ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు
జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.








