Connect with us

ARTICLE'S

కలమే గళం విప్పిన వేళ

suresh sitharla

Published

on

DLN CHAARI NIZAMABAD

అను శక్తి కన్నా అక్షర శక్తి గొప్పది.

జర్నలిస్టులకు భద్రత కల్పించాలి.

పాత్రికేయులకు చట్టబద్ధమైన రక్షణ అవసరం.

పత్రిక స్వేచ్ఛ లేకుంటే స్వతంత్య్రం లేనట్టే.

అణగారి పోతున్న జర్నలిస్ట్ ల హక్కులు.

జర్నలిస్టుల సంక్షేమం ఏ ప్రభుత్వాలు పెద్దగా చూడలేదు.

జనం వెలుగు:- సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల రోజు వారి సమస్యల కు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు లక్షణమైన అక్షరాలే అస్త్రాలుగా మేలిమి మాటలే తూటాలుగా చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటంలోనూ, చైతన్యవంతుల్ని చేయడంలోనూ, మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. జర్నలిజంలో పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్న మార్పులను ఎంతవరకు నివారించే కనీస ప్రయత్నం జర్నలిస్టులమైన మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని మన జర్నలిస్టు సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. జర్నలిస్టు సంఘాలు ఏమైనా కానీ వాటి అన్నింటి డిమాండ్స్ ఒక్కటే వాటి లక్ష్యం కూడా అంతిమంగా జర్నలిస్టు సంక్షేమమే. ఏది ఏమైనాప్పటికీ గతంలో మన జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వం ముందు ఎన్ని డిమాండ్స్ పెట్టినా వస్తూ పోతూ ఉన్న ఏ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో మన జర్నలిస్టుల సమస్యలకు పెద్దగా కృషిచేసి అమలుపరిచిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు. రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలలో ఆయా మండలాల్లో 10 నుండి 15 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు 90 % మందికి ఈనాటికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. జర్నలిస్టులపై ఎన్నో రకాల అణచి వేత వ్యవహారాలు జరుగుతున్నాయి. కేజీ నుండి పీజీ వరకు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సాధించే విషయంలో వెనుకబడ్డం.

జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యశాలలో ఉచిత వైద్యం అమలు చేయాలని డిమాండ్ కూడా పాతదే జర్నలిస్టుల సంక్షేమ అంటూ ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డు అమలు విధానం పై ఏ రోజైనా ఈ జర్నలిస్టు సంఘాలు పరిశీలన చేశాయా…? ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాపాయ పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం కోసం వెళితే ప్రభుత్వం ఎంతో గొప్పగా మనకు ఇచ్చిన హెల్త్ కార్డు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితులు ఉన్న పక్షంలో జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఉంటే…. మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అనే పాట పాడడం సమంజసమేనా….? ఉన్న దానిని సక్రమంగా అమలు చేయించాలి. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు 10000 గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాలి అనే డిమాండ్ ఒకసారి పరీశీలన చేసుకుంటే మంచిది. మరో విషయం మీడియా సంస్థలు ఎందుకు కార్మిక చట్టాలు, వేతన చట్టాలు అమలు చేయకుండా మనుగడ సాగిస్తున్నాయో ఏ రోజైనా ఈ జర్నలిస్టు సంఘాలు ఆలోచించాయా…. ? అక్రిడేషన్ అంటే ప్రభుత్వం గానీ మీడియా సంస్థలు గాని తమ ఆస్తిపాస్తులలో ఎన్ని వేల కోట్లు జర్నలిస్టులకు రాసిస్తున్నాయో తెలపాలి. చిన్న అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడానికి సవా లక్ష నిబంధనలు మీడియా సంస్థలలో ఉద్యోగాలుగా చేరి జర్నలిస్టు వృత్తికి కట్టుబడి నీతి నిజాయితీలతో పని చేసే జర్నలిస్టులకు తమ బాధ్యతగా అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన మీడియా సంస్థలు అక్రిడేషన్ విషయంలో వ్యవహరిస్తున్న విధానాలను ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి జర్నలిస్టుకు ఉంది.

అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.

ఒక కాకి చస్తే వంద కాకులు వాలుతాయి. కాకులకు ఉన్న ఐక్యత కలాలకు లేవా? ఎందుకు మరి యూనియన్లు ఎన్నాళ్లీ మౌనం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాటి దెబ్బలు తిన్నాం. కలానికి పదును పెట్టి ఉద్యమానికి ఊపిరి పోశo . ప్రజల్లో చైతన్యం తెచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశాం. జై ఆంధ్ర అన్నోలన్నీ జై తెలంగాణ అంటూ నినాదాలు గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడాలా చేశం. ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన కలం వీరులం మరి ఎటు పోతుంది ఉద్యమ స్ఫూర్తి. స్వరాష్ట్ర సాధన తో బానిస సంకెళ్లు తెగిపోయాయి అనుకున్నాం,కానీ ఇప్పుడు పరాయి పాలనలోనే స్వేచ్ఛగా ఉన్నాం అని గుర్తు చేస్తున్నా ఎందుకు మీడియాపై ఇంత కక్ష్య…. బాధ్యతలు గుర్తు చేస్తున్నందుకా !. అవినీతిని తూర్పార పడుతున్నందుకా! సంక్షోభిత తెలంగాణలో, కల్లోలిత తెలంగాణలో పత్రికా విలేకరులు విధి నిర్వహణలో కల్లోల భరితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వివిధ వర్గాలలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆ పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడడంతో వారి బాధ్యత తీరిపోలేదు. రాజ్యాంగం 19వ అధికారణం ద్వారా బావ ప్రకటన స్వేచ్ఛ కల్పించిన హక్కే పత్రిక స్వేచ్ఛకు మూలం. జర్నలిస్టు సృజనాత్మక శక్తి ఎటు పోతుంది. ప్రతి చిన్న విషయాలపై స్పందించే జర్నలిస్టులు తమ సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు. ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading