Kamareddy
అన్ని కుల సంఘల అభివృద్ధికి చేయూతనందిస్తున్నాం
అన్ని కుల సంఘల అభివృద్ధికి చేయూతనందిస్తున్నాం – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
రాయకూర్ క్యాంపు, రాణంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
జనం వెలుగు, బాన్సువాడ సెప్టెంబర్ 30:- తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కులాల వారి అభివృద్ధికి చేతనందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంప్, రాణంపల్లి గ్రామాలల్లో పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో ముఖ్యఅతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాయకూర్ క్యాంప్ గ్రామంలో రూ.10 లక్షలతో ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడ, రూ.2 లక్షలతో పోచమ్మ గుడి, రూ.10 లక్షలతో పశువైద్యశాల ప్రారంబించారు. అనంతరం రాణంపల్లి గ్రామంలో రూ.35 లక్షలతో నిర్మించిన మున్నూరుకాపు సంఘ భవనం ప్రారంభోత్సవం, హనుమాన్ మందిర నిర్మాణం, శంకుస్థాపన, పల్లె దవాఖాన, ఎస్సి కమ్యూనిటి హాల్, గంగాపుత్ర సంఘం తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్ దేనిని ఆయన కొనియడారు. అనంతరం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న ఐదు మంది లబ్ధిదారులకు గృహ లక్ష్మి మంజూరు పత్రాలను స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పిటిసి నారోజి గంగారం, బోధన్ ఆర్థివో రాజా గౌడ్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సై నీరేష్, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నట్కరీ సాయిలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాయకూర్ క్యాంపు సర్పంచ్ నిర్మల, రాణంపల్లి సర్పంచ్ డయాల రోజా లక్ష్మణ్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Education
విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్కు వినతి


విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కలెక్టర్కు వినతి
జనంవెలుగు, కామారెడ్డి:- విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలని కోరుతూ, పౌర హక్కుల కోసం పనిచేస్తున్న జాతీయ స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాల ప్రస్థానం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి (DEO)లకు CCR ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. 2025–26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 12(1)(C) నిబంధనను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంచికట్ల అనిల్ కుమార్ సూచనలతో మిషన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అశోక్ కాకర్ల నేతృత్వంలో జిల్లా ప్రతినిధులు జోనల్ కార్యదర్శి కరీముద్దీన్, జిల్లా కార్యదర్శి బూర్ల శ్రవణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి. భాస్కర్, మీర్జాపురం రామకృష్ణ, ఎస్.కే. సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Kamareddy
గ్రామపంచాయతీ అవకతవకలపై కలెక్టర్కు సీసీఆర్ నివేదిక సమర్పణ


గ్రామపంచాయతీ అవకతవకలపై సీసీఆర్ నివేదిక కలెక్టర్కు సమర్పణ
జనంవెలుగు, కామారెడ్డి:- కామారెడ్డి జిల్లా నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. ఈ విషయంపై సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించి, అనేక లోటుపాట్లను గుర్తించారు. గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగానికి పైగా రిజిస్టర్లు లేని విషయాన్ని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా తెలిపారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు కూడా గుర్తించబడ్డాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినప్పటికీ, కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయి. వాటిలో కూడా నిర్వహణ సరిగా లేకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఆధారంగా తీసుకుని సీసీఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక ఫైనల్ రిపోర్టును రూపొందించి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డిపిఓలకు అందజేసింది. సీసీఆర్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేల దరఖాస్తులు, రికార్డుల తనిఖీలు చేశామని, ఎవరైనా అవకతవకలను గమనించినపుడు తమ సంస్థను సంప్రదించాలని, సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేయబడతాయని తెలిపారు. అదనంగా, ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించడానికి సీసీఆర్ సంస్థ పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో నేవూరి రత్నాకర్, చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, కరీముద్దీన్, ఉత్తర తెలంగాణ జోన్-1 ప్రతినిధి బి. శ్రావణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ వసంత్ జాదవ్, కేతి మల్లికార్జున్, షేక్ ముజీబ్, నయీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Crime
స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ


స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ
భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
జనంవెలుగు, కామారెడ్డి, సెప్టెంబర్18:- కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సులో పెను ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్ప టికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.








